వెర్రి అభిమానం..!!

వెర్రి అభిమానం..!!


ఒక హీరో ప్రొడ్యూసర్ని షూట్ చేస్తే, అతనికి ఏ శిక్షా ఉండదు.. ఎక్కడ సాక్ష్యం చెప్తారో అని వాచ్మెన్ ని బండతో చంపినా నో కేస్..
నో ఇన్వెస్టిగేషన్..!!

అలాంటి వాళ్ళని మనం వోటు వేసి మరీ ఎన్నికల్లో గెలిపిస్తున్నాం... ఇక్కడ వాళ్ళకి శ్రీరామ రక్ష ఏంటంటే తప్పొప్పులు కూడా ఆలోచించకుండా మనం వెర్రెత్తిపోయే కులాభిమానం..
అందుకే ప్రభుత్వాలైనా పోలీసు లైనా వాళ్ళని టచ్ చేయాలంటే భయపడుతున్నారు.. కులాల వోట్లు ఎక్కడ పోతాయో అని తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు!!

అలాగే ఒక హీరో యాక్సిడెంట్ చేసి కార్ ని వదిలేసి పారిపోతే,
అతనికీ ఏ శిక్షా ఉండదు.. ఎక్కడ గన్మెన్ సాక్ష్యం చెప్తారో అని అతని చావుకి కారణమైనా నో గిల్టీ..
సొంత కుటుంబ సభ్యులే గన్మెన్ ని ఇంటికి రానివ్వలేదంటే ఇంక ఏ లెవల్ లో ఆ కుటుంబాన్ని బెదిరించుంటారో ఆలోచించండి??

చివరికి ఆ హీరో నిర్దోషి.. పోనీ అలాంటి వాళ్ళకి శిక్షలు వేద్దామన్నా మనం వూరుకుంటామా... అయ్యో మన పిచ్చి అభిమానంతో దేశాన్ని అట్టుడికించమా??
అవసరమైతే ఒక వారం రోజులు తినకుండా ఐనా రోడ్డు మీదే కూర్చొని అభిమాన హీరోని విడిపించుకోమూ!!

అభిమానం ఉండాల్సింది హీరోల మీదా.. కన్న తల్లిదంద్రుల మీదా?
అసభ్య చిత్రాలు తీస్తున్న వాళ్ళ మీదా... అక్షరాలు దిద్దించిన ఉపాద్యాయుల మీదా?
నటించే నటుల మీదా.. నీ ఆకలి తీరుస్తున్న రైతుల మీదా?
డబ్బు తీసుకొని సినిమాలు చేసే వాళ్ళ మీదా.. ఏ స్వార్ధం లేకుండా దేశన్ని రక్షిస్తున్న సైనుకుల మీదా?

ఇంకెదుకు "రాజ్యాంగం ద్రుష్టిలో భారతీయులందరూ సమానమే" అన్న వాక్యం మన పాఠ్య పుస్తకాలలో..??
"రాజ్యాంగం, ప్రజల ద్రుష్టిలో హీరో లు కొంచెం ఎక్కువ" అని మారిస్తే చాలా బావుంటుందేమో!!
ఎప్పుడైతే కుల, మత , అభిమాన పిచ్చిలను వదిలిపెడతామో అప్పుడే మనం మార్పు అనే మహాయగ్నంలో భాగమవుతాం!!

                                                                                                                          లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అమ్మ కొడుకు...

అబ్బాయికి 'అప్పగింతలు' !!

మన ఊరి 'సంక్రాంతి'!!