Posts

వెర్రి అభిమానం..!!

Image
వెర్రి అభిమానం..!! ఒక హీరో ప్రొడ్యూసర్ని షూట్ చేస్తే, అతనికి ఏ శిక్షా ఉండదు.. ఎక్కడ సాక్ష్యం చెప్తారో అని వాచ్మెన్ ని బండతో చంపినా నో కేస్.. నో ఇన్వెస్టిగేషన్..!! అలాంటి వాళ్ళని మనం వోటు వేసి మరీ ఎన్నికల్లో గెలిపిస్తున్నాం... ఇక్కడ వాళ్ళకి శ్రీరామ రక్ష ఏంటంటే తప్పొప్పులు కూడా ఆలోచించకుండా మనం వెర్రెత్తిపోయే కులాభిమానం.. అందుకే ప్రభుత్వాలైనా పోలీసు లైనా వాళ్ళని టచ్ చేయాలంటే భయపడుతున్నారు.. కులాల వోట్లు ఎక్కడ పోతాయో అని తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు!! అలాగే ఒక హీరో యాక్సిడెంట్ చేసి కార్ ని వదిలేసి పారిపోతే, అతనికీ ఏ శిక్షా ఉండదు.. ఎక్కడ గన్మెన్ సాక్ష్యం చెప్తారో అని అతని చావుకి కారణమైనా నో గిల్టీ.. సొంత కుటుంబ సభ్యులే గన్మెన్ ని ఇంటికి రానివ్వలేదంటే ఇంక ఏ లెవల్ లో ఆ కుటుంబాన్ని బెదిరించుంటారో ఆలోచించండి?? చివరికి ఆ హీరో నిర్దోషి.. పోనీ అలాంటి వాళ్ళకి శిక్షలు వేద్దామన్నా మనం వూరుకుంటామా... అయ్యో మన పిచ్చి అభిమానంతో దేశాన్ని అట్టుడికించమా?? అవసరమైతే ఒక వారం రోజులు తినకుండా ఐనా రోడ్డు మీదే కూర్చొని అభిమాన హీరోని విడిపించుకోమూ!! అభిమానం ఉండాల్సింది హీరోల మీదా.. కన్న ...

అమ్మ ఆత్మీయత..!!

Image
అమ్మ ఆత్మీయత..!! పొద్దున్నే నిద్రలేవగానే కాఫీకి అమ్మ, టూత్ పేస్ట్ కనపడకపోతే అమ్మ, స్నానానికి సోప్ అయిపోతే అమ్మ, టిఫిన్ వడ్డించడానికి అమ్మ, ఆ టిఫిన్ తినేటప్పుడు ఎక్కిళ్ళు వస్తే నీళ్ళకి అమ్మ, ఖర్చులకి నాన్నని డబ్బులు అడగడానికి అమ్మ, భోజనం చేసేటప్పుడు TV ఛానల్ మార్చడానికి అమ్మ, నీ బట్టలు ఉతకడానికి అమ్మ, సాయంత్రం ఆకలేస్తే అమ్మ, బయట తిరుగుతున్నప్పుడు చిన్న దెబ్బ తగిలితే అమ్మ, తగిలిన ఆ దెబ్బకి మందు రాయడానికీ అమ్మ, రాత్రి పూట చపాతీ కావాలంటే అమ్మ, పడుకున్నాక లైట్ ఆర్పడానికి కూడా అమ్మ, ఇలా పొద్దున్నుంచి పడుకునే వరకు ప్రతీదానికి అమ్మ.... అమ్మ.... అమ్మ....!! ఒక రోజులో అమ్మ మన కోసం చేసే పనులు ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు, ఇంటినుంచే వెళ్ళే ఉధ్యోగస్తులు అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే... ఒక్కసారి హాస్టల్లో ఉండి చూడండి, అమ్మ మనకోసం ఎంతలా ఇల్లంతా పరిగెట్టిందో, మన అవసరాలని తీర్చడానికి ఎన్ని ఆపసోపాలు పడిందో అర్ధం అవుతుంది. అటువంటి అమ్మకోసం, సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు వంట చేస్తే తప్పేంటి? ఇల్లు ఊడ్చి అంట్లు కడిగితే మాత్రం తప్పేంటి? హాస్టల్లో నువ్వే ఉతుక్కునే బట్టలు ఇంటిదగ్గర కూడా...

మనిషికి మనిషే శత్రువు..!!

Image
మనిషికి మనిషే శత్రువు!! బాగా రద్దీగా ఉన్న ఒక పట్టణం, అందులో తోపుడు బండి మీద జామకాయలు అమ్ముకుంటున్న ఓ చిరు వ్యాపారి. అతని మనసులో ఎన్నో ఆలోచనలు.. ఈ రోజైనా ఒక 200 రూపాయలకి అమ్మితే బాగుండు, ఇంటికెళ్తూ తన చిట్టి తల్లి రెండు రోజులనుంచి అడుగుతున్న నోటు పుస్తకం కొనుక్కెళ్దామని.. అది ఇచ్చినప్పుడు తన కూతురు మొహంలో కలిగే ఆనందం కోసం ఇంకో 2 గంటలైనా అదే ఎండలో నిలబడడానికి సిద్దం. తను కష్టపడి పోగేసిన రూపాయి రూపాయి బ్యాంక్ లో దాచుకుంటే ఉపయోగం ఏంటని సంవత్సరానికో 1000 రూపాయలు వచ్చినా వచ్చినట్టే అనే ఆశతో వడ్డీకి ఇచ్చిన ఓ సగటు మధ్యతరగతి వ్యక్తి ఇంకో వైపు. కొడుకు కాలేజ్ ఫీజ్ కట్టడానికి ఆఖరి రోజు దగ్గర్లోనే ఉందని గుర్తెరిగి, ఈరోజైనా తను వడ్డీకిచ్చిన వాళ్ళు తిరిగి తన డబ్బులు ఇస్తారేమో అన్న ఆశతో కాళ్ళీడ్చుకుంటూ అటువైపుగా మొదలైన నడక. ఇంతలో ఒక ముగ్గురు బండి వైపు దూసుకొచ్చి, జామకాయల్ని తీసుకొని తింటూ.. డబ్బులిద్దాం అనే ఉద్దేశ్యం ఇసుమంతైనా కనపడని వాళ్ళమొహంలో, మత్తులో ముంగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ధోరణి కనిపించింది ఆ తోపుడు వ్యాపారికి.. దగ్గరికెళ్ళి, తీసుకున్న పళ్ళకి పైకం చెల్లించమని కొరుకున్నాడా చిర...

హక్కూ - హాఫ్ బ్రాందీ!!

Image
హక్కూ - హాఫ్ బ్రాందీ!! ఏవే!! ఆ పసుపు రంగు పార్టీ వాళ్ళు డబ్బులివ్వడానికి వచ్చారా?? లేదక్కా ఈరోజొస్తారంటా.. సచ్చినోళ్ళు, ఎప్పుడైనా ఇవ్వాల్సిందేగా అదేదో త్వరగా ఇస్తే ఏం పోయింది.. ఆ టేబుల్ ఫ్యాన్ పార్టీ వాళ్ళు చూడు మొన్నే ఇచ్చి వెళ్ళారు.. ఇవే ఎన్నికల వేళల్లో మనకి తరచుగా వినిపించే మాటలు.. అవునక్కా!! మరి ఎవరికి ఓటు వేద్దామని అనుకుంటున్నావ్? ఏమోనే ముందు అందరినీ ఇవ్వనీ.. అందరిచ్చాక బాగా ఆలోచించి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తా.. ఇలా అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకొని ఓటు మాత్రం ఏ వొక్కడికో వేస్తాం..ఎవరో ఒక్కళ్ళకే ఓటు వేసేటప్పుడు అందరి దగ్గర డబ్బు తీసుకోవడమెందుకు చెప్పండి... మళ్ళీ అందులో ఖచ్చితంగా మీకే నా ఓటు అని దీపాలు కూడా ఆర్పడం...  ఇదే విషయం మన పెద్దవాళ్ళని అడిగితే ఈ ఎన్నికలు వచ్చెదే ఏ 5 సంవత్సరాలకో అప్పుడే కదా మనకో 6000 దక్కేది అంటారు... వాళ్ళు తీసుకుంటున్నారు అంటే కొంచెమైనా అర్ధం చేసుకోవచ్చు.. కానీ చదువుకున్న వాళ్ళు ఇలా డబ్బులకీ, క్రికెట్ కిట్ లకి లేదంటే బీర్ బిర్యానీ లకి అమ్ముడు పొతుంటేనే భారతమాత సిగ్గుతో తలవంచుకుంటుంది.. చదివినోడి కంటే చాకలోడు మేలన్నట్టుగా అన్నీ తెలిస...

'ఇప్పటి' వినాయకచవితి!

Image
'ఇప్పటి' వినాయకచవితి!    పాలు తాగే పిల్లల దగ్గరినుంచి పంచ కట్టిన పెద్దోళ్ళ వరకు, కన్నె పడుచుల దగ్గరినుంచి కాటికి కాళ్ళు చాపిన ముసలమ్మల వరకు, బిటెక్ చేసినవాళ్ళ దగ్గరినుంచి బియ్యం పండించే వాళ్ళ వరకు, పని కోసం ఎదురుచూస్తున్న యువత దగ్గరినుంచి ప్రభుత్వ ఉద్యోగస్తుల వరకు ఆది దేవుడనైనా కావొచ్చు, వింతైన ఆకారం వల్ల కావొచ్చు ఇలా అందరికీ వినాయకచవితి అంటే ప్రత్యేకమైన అభిమానమే!! నా చిన్నప్పుడు, వేకువ జామున పత్రికోసం పొలాల గట్ల మీద పరిగెట్టినా, రూపాయికి ఒక మట్టి బొమ్మ ముద్రేసి ఇచ్చినా, దాన్ని తామరాకులో పెట్టుకొని ఇంటికొస్తుంటే పొందిన ఆనందమైనా, కుంకుడు కాయలతో తలంటు పోసుకున్నా, కొత్త బట్టలు, చదవాల్సిన పుస్తకాలు పత్రితో పాటు గణపయ్య ముందుండినా, వినాయక చరిత్ర అందరికి అర్ధమయ్యేలా చదివినా, ఉండ్రాళ్ళు బొజ్జ గణపయ్యకి నైవేద్యంగా సమర్పించినా, బయటకెళ్ళి ఒక పదినిముషాలు తలుపులు మూసివేసినా, దేవుడొచ్చి మనమెట్టిన నైవేద్యం తింటాడని నమ్మినా, బజార్లో పెట్టిన పెద్ద మట్టి వినాయకుడితో మన బుజ్జి గణపయ్యని కలిపేసినా.. ఇవన్నీ ఆ రోజులకే చెల్లిపోయాయి!! ఇప్పుడంతా కమర్షియల్ గా వినాయకచవితిని జరుపుకునే కలికాలం రోజులు. ...

మనకొచ్చిన స్వాతంత్ర్యం..!!

Image
మనకొచ్చిన స్వాతంత్ర్యం..!! స్వాతంత్ర్యం వచ్చింది, పరిపాలన ఏమైనా మారిందా..? స్వాతంత్ర్యం వచ్చింది, పాలించే వాళ్ళు ఏమైనా మారారా..? స్వాతంత్ర్యం వచ్చింది, భారతదేశ దోపిడీ ఏమైనా మారిందా..? స్వాతంత్ర్యం వచ్చింది, తప్పు చేసినోళ్ళని శిక్షించగలుగుతున్నామా..? స్వాతంత్ర్యం వచ్చింది, అవినీతిపరులని నిలదీయగలుగుతున్నామా..? స్వాతంత్ర్యం వచ్చింది, అమ్మాయిలు అర్ధరాత్రుళ్ళు బయటకి వెళ్ళగలుగుతున్నారా..? స్వాతంత్ర్యం వచ్చింది, మర్డర్లు,మానభంగాలు ఆగిపోయాయా..? స్వాతంత్ర్యం వచ్చింది, పేదోడి పొట్ట కనీసం నిండుతుందా..? స్వాతంత్ర్యం వచ్చింది, రైతులు రారాజులు కాగలిగారా..? స్వాతంత్ర్యం వచ్చింది, ప్రజలు నిరసనల పేరిట రోడ్డెక్కడం మానేశారా..? స్వాతంత్ర్యం వచ్చింది, రూపాయి విలువేమైనా పెరిగిందా..? స్వాతంత్ర్యం వచ్చింది, తెల్లవాడికి సలాం అనడం ఏమైనా ఆపేశామా..? స్వాతంత్ర్యం వచ్చింది, భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఆపేశామా..? స్వాతంత్ర్యం వచ్చింది, అది తెచ్చిన వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకున్నామా..? స్వాతంత్ర్యం వచ్చింది, స్వేచ్ఛా గాలి పీల్వగలుగుతున్నామా..? స్వాతంత్ర్యం వచ్...

ఆ రోజులు..!!

Image
ఆ రోజులు..!! ఒంటిపూట బడుల కోసం ఒంటి కాలుపై ఎదురు చూసిన ఆ రోజులు, ఎండాకాలం సెలవుల్లో నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన ఆ రోజులు, రూపాయికి రెండు పుల్ల ఐసులు కొనుక్కున్న ఆ రోజులు, చిరిగిన నిక్కర్లతో బడికి వెళ్ళిన ఆ రోజులు, బియ్యం సంచితో స్కూల్ బ్యాగ్ ని కుట్టించుకున్న ఆ రోజులు, పక్కన ఉన్న అమ్మాయిని స్నేహితురాలిగా మాత్రమే చూసిన ఆ రోజులు, కరెంట్ లేకపోయినా చెమటలు కారేలా క్రికెట్ ఆడిన ఆ రోజులు, ప్రైవేట్ లో కరెంట్ పోగానే కొవ్వొత్తి ముందు గుమిగూడి ముచ్చట్లాడిన ఆ రోజులు, కరుగుతున్న కొవ్వొత్తిని గిన్నె కొవ్వొత్తిలా మార్చేసిన ఆ రోజులు, చీకటైతే చల్లని గాలికోసం ఆరుబయట మంచాలేసిన ఆ రోజులు, అమ్మ పక్కన పడుకున్నట్టు నటిస్తూ కొంగుకున్న చిల్లర నొక్కేసిన ఆ రోజులు.. ఆ రోజులకీ ఈ రోజులకీ పోలికా? అవి గోమాత నుంచి వచ్చే పవిత్రమైన గోమూత్రమైతే, ఇవి మనమే కల్తీ చేసిన జెర్సీ ఆవుల నుంచి వస్తున్న పాలదారవంటివి.. సెల్ ఫోన్లు లేకపోయినా ఉత్తరాలతో ఊరిలో ఉన్న చుట్టాలని చుట్టేసిన రోజులవైతే, బంధువులకి దూరంగా ఉన్నామో భార్యాబిడ్డలకి దగ్గరగా ఉన్నామో అర్ధం కాని రోజులివి!! అనుబంధాలకోసం, ఆప్యాయతలకోసం ఆస్తులని సైతం వదులుకున్న రోజులవైతే, అవ...