విదేశీయానం..!!

విదేశీయానం..!!


విమానమెక్కి పోతున్నానన్న ఆనందం కన్నా వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూడలేనన్న బాధే ఎక్కువ
విశాఖపట్టణంలో చదువుకోసం కూడా దూరంగా వుండలేని మనం విదేశాల పేరిట దూరమవడం
భారతదేశంలో వున్న రూపాయి కంటే విదేశాళ్ళో దొరికే విలువైన డాలర్సే మనకెక్కువ
అర్ధవంతమైన తెలుగులో మాట్లాడకుండా అర్ధం పర్ధం లేని ఆంగ్లంలో పలకరింపులు
కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోవడం కంటే కోట్లు సంపాదించడం పైనే ద్యాస

వాడికెప్పటికో వూరిమీద బుద్ది పుట్టి వస్తా అంటే
అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా

సంవత్సరం తర్వాత తోడ పుట్టినోడి పెళ్ళికి వస్తా అంటే
అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా

ముద్దుల చెల్లెలు పెద్దమనిషి అయినప్పుడు వస్తా అంటే
అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా

చెల్లిని ప్రేమగా చూసుకోబోయే బావకి కాళ్ళు కడగాలి వస్తా అంటే
అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా

మీకు అనారోగ్యంగా వుందని తెలిసి వస్తా అంటే
అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా

అదే మంచంలో పడ్డాక చివరి చూపు కోసం మీ బిడ్డలు రావాలని కోరుకున్నప్పుడు,
ఈసారి వాళ్ళ వంతు
అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా..!!!

ఇలా వాళ్ళని తయారు చేసింది ఎవరంటే ఖచ్చితంగా మనమే..
ఇప్పుడున్న కాలంలో డబ్బు సంపాదన ముఖ్యమే కానీ ఆ పేరు మీద  మిమ్మల్ని మీరు అనాధల్ని చేసుకోవడం ఎంతవరకు సమంజసం?
వాళ్ళు పంపే డబ్బు కాదు వౄద్ధాప్యంలో మీకు కావాల్సింది వాళ్ళు చూపే ప్రేమ
మీరు పిలిస్తే పలికే దూరంలో వుండాలి కానీ పిలిచినా వాళ్ళు రాలేనంత దూరంలో కాదు
విలువలకంటే డబ్బు ముఖ్యం కానే కాదు అని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశ్యం!!

                                                                                                                                    లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...