ప్రేమాంతర్యామి..!!

ప్రేమాంతర్యామి..!!


 లంగా వోణీ వేసుకొని పద్దతిగా వుంటే నాకిష్టం,
జీన్స్ స్కర్ట్స్ లు వేసుకొని పోష్ గా వుండడం తనకిష్టం!!

ఉత్తరాల ద్వారా ప్రేమని తెలియజేయడం నాకిష్టం,
ఫోన్ లు వాట్సాప్ లతో ప్రేమ ని వ్యక్తపరచడం తనకిష్టం!!

తనతో కలిసి గుడికెళ్ళడం నాకిష్టం,
సినిమాలు, షికార్లు అంటూ తిరగడం తనకిష్టం!!

అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు పొలమారితే నీళ్ళందించడం నాకిష్టం,
ఫ్లోర్ మీద డాన్స్ చేస్తూ షాట్స్ తాగడం తనకిష్టం!!

పది దాటితే హాయిగా నిద్రపోవడం నాకిష్టం,
అర్ధరాత్రైనా అర్ధం పర్ధం లేని సొల్లు వాగితే తనకిష్టం!!

పెద్దోళ్ళందరినీ ఒప్పించి పెళ్ళిచేసుకోవడం నాకిష్టం,
ఎవరూ ఒప్పుకోకపోయినా పర్లేదు లేచిపోయి పెళ్ళిచేసుకోవడం తనకిష్టం!!

పెళ్ళయ్యాక ఉమ్మడి కుటుంబంగా వుండడం నాకిష్టం,
మనకంటూ ఎవరూ లేకుండా ఏకాకుల్లాగా వుంటే తనకిష్టం!!

వచ్చే డబ్బులు సరిపోకపోతే వున్నంతలో కాళ్ళు ముడుచుకోవడం నాకిష్టం,
రాబడితో పొంతనే లేకుండా హంగులు ఆర్భాటాలంటే తనకిష్టం!!

అమ్మాయి పుడితే మా అమ్మే మళ్ళీ పుట్టిందనుకోవడం నాకిష్టం,
మా అమ్మే పుట్టిందని అనకుండా వుంటే తనకిష్టం!!

అమ్మనీ, తననీ ఒకేలా చూసుకోవడం నాకిష్టం,
అమ్మని బయటకి గెంటేస్తే తనకిష్టం!!

సజాతి ధ్రువాలు ఆకర్షిచుకుంటాయి.. విజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి అంటే ఏంటో అనుకున్నాము..
అభిప్రాయాల్లో ఇంత తేడా వున్న ఇద్దరి మనసులు కలిసి జీవించడం కూడా చాలా కష్టం!!
పొనీ పెళ్ళయ్యాక సర్దుకుపోతారులే అనుకుంటే, అలాంటి మనస్తత్వములో ఆ తరానికీ ఈ తరానికీ పోలికెక్కడ??

                                                                                                                                 లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

  1. పంచె కట్టుకుంటే తనకిష్టం. ప్యాంట్ వేసుకుంటే నీకిష్టం. ఈ రోజుల్లో ఉత్తరాలేంది బయ్యా. ఒకరికొకరు సర్దుకుపోతే ఉండదు ఏ కష్టం.

    ReplyDelete
    Replies
    1. నా చివరి వాఖ్యం అదేనండి!! సర్దుకుపోతే ఏ గొడవా లేదు.. కానీ ఈ తరంలో సర్దుకుపోయేవారెంతమంది??

      Delete

Post a Comment

Popular posts from this blog

అమ్మ కొడుకు...

అబ్బాయికి 'అప్పగింతలు' !!

మన ఊరి 'సంక్రాంతి'!!