మనగురించి మనమొప్పుకోని 'నిజాలు'

మనగురించి మనమొప్పుకోని 'నిజాలు'!!


చదువు చెప్పిన గురువుల్ని గౌరవించడం తెలీదు కానీ,
టీచర్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

నిన్ను కన్న నీ తల్లికి ఇంట్లో బాగలేకపోఇనా మనకి పట్టదు కానీ,
మదర్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

నాన్న తిట్టాడని స్నేహితుల ముందు ఆయన్ని తిట్టడం వచ్చు కానీ,
ఫాదర్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

ఒంటరిగా కనిపించే స్త్రీలని గౌరవించడం తెలీదు కానీ,
వుమన్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

స్త్రీలని సమానంగా చస్తే చూడలేవు కానీ,
వుమన్స్ సమానత్వం డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

ప్రేమించిన అమ్మాయికి సైతం తనకిస్టమైన వాడిని ఎంచుకునే స్వేచ్చ వుందని నమ్మవు కానీ,
వాలెంటైన్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

ఆస్తుల విషయంలో అక్కా చెల్లెళ్ళని తరిమేయడానికి వెనకాడవు కానీ,
సిస్టర్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

పక్కని వాడిని ఫూల్ చేయడంలో పైశాచిక ఆనందం తప్ప నిజమైన ఆనందం లేదని ఒప్పుకుంటావు కానీ,
ఏప్రిల్ ఫూల్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

తోటి కార్మికులని సమానంగా చూడలేవు కానీ,
మే డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

రక్తం ఇవ్వాలంటే ఎక్కడలేని భయం కానీ,
బ్లడ్ డోనార్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

అవయవాలు దానం చేస్తే తరవాతి జన్మలో అవి లేకుండా పుడతాం అని నమ్ముతావ్ కానీ,
ఆర్గాన్స్ డోనార్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

ఎయిడ్స్ సోకిన వ్యక్తుల్ని మనుషులుగా కూడా చూడలేవు కానీ,
ఎయిడ్స్  డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

స్వాతంత్ర్య యోధుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతావ్ కానీ,
ఇండిపెండెన్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు?

ఇవన్నీ మనకి మనం తెలుసుకోమూ ఎవరన్నా చెప్పినా ఒప్పుకోము....
పోనీ ఒప్పుకోకపోయినా పర్లేదు, మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోగలిగితే అంతకంటే కావలిసిందేముంది!!

                                                                                                                               లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అమ్మ కొడుకు...

అబ్బాయికి 'అప్పగింతలు' !!

మన ఊరి 'సంక్రాంతి'!!