ఒకప్పుడు - ఇప్పుడు - పెళ్ళయ్యాక

ఒకప్పుడు - ఇప్పుడు - పెళ్ళయ్యాక

కాలాన్ని బట్టి మనిషి మారుతూ ఉంటాడు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు..
నిజమే నండీ.. కావాలంటే ఇవి చదవండి.. ఒక్కో ప్రాయంలో ఒక్కోలా ఎలా ప్రవర్తించామో మీకే తెలుస్తుంది!!

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు:
చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తారని యునిఫాం వేసుకొని స్కూల్ కి వెళ్ళాం అప్పుడు
ఆఫీస్ కి సెలవు ఇచ్చారు.. రోజంతా హ్యాప్పీ గా నిద్రపోవచ్చు అని ఇప్పుడు
పిల్లల్ని స్కూల్ కి పంపితే ఇంట్లో ఏ అల్లరీ వుండదు అని పెళ్ళయ్యాక!!

గాంధీ జయంతి రోజు:
స్కూల్ కి సెలవు..స్నేహితులతో క్రికెట్ ఆడుకోవచ్చని అనుకున్నాం అప్పుడు
ఆఫీస్ లేదు సరే.. ఆఫీసర్స్ చాయిస్ అయినా దొరికితే బాగుండు అని ఇప్పుడు
పనేం లేదు కాబట్టి పెళ్ళాంతో ఫస్టు షోకి వెళ్దాం అని పెళ్ళయ్యాక!!

మదర్స్ డే రోజు:
అలాంటి రోజొకటి వుందని కూడా మనకి తెలీదు అప్పుడు
మేనేజెర్ ఇచ్చిన పని చేయడం తోనే సరిపోయిందని అమ్మకి ఫోన్ చేయడానికి సమయమేదని ఇప్పుడు
నాకు అమ్మే లేదు ఇంకెవరికి చెప్పాలి విషెస్ అని పెళ్ళయ్యాక!!

టేచర్స్ డే రోజు:
ఎప్పుడూ కొడుతూనే వుంటాడు.. వీడసలు మనిషేనా అననుకుంటాం అప్పుడు
ఈయనకంటే మనకే జీతమెక్కువ అననుకుంటాం ఇప్పుడు
ఒకప్పుడు ఆయన చదువు చెప్పడం వల్లే మనం ఇలా వున్నాం అని కూడా మర్చిపోతాం పెళ్ళయ్యాక!!

పొలిటీషియన్ చనిపోతే:
ఒకటే నవ్వులూ.. ఒకటే కేరింతలు.. మనకోసమే చనిపోయాడన్న ఆనందం అప్పుడు
హమ్మయ్యా మేనేజెర్ నుంచి దొబ్బులు ఎరోజుకి తప్పాయి అని ఇప్పుడు
త్వరగా ఇంటికొచ్చామని టీ.వీ చూస్తూ మిగతా సమయాన్ని గడిపేయడం పెళ్ళయ్యాక!!

ఇలా ఈ ప్రత్యేకమైన రోజులని మనం జరుపుకున్నదెప్పుడు?
ఏం జరుపుకుంటున్నామో ఎందుకు జరుపుకుంటున్నామో మనకే కాదు ఎవ్వరికీ తెలీదు..
సెలవైతే వచ్చిందని మన పనులు మనం చూసుకోవడం తప్ప..!!
24 గంటల్లో 24 సెకండ్ల పాటైనా ఆ రోజు ప్రాముఖ్యత గురించి నెమరువేసుకుంటున్నామా??
అలా స్మరించుకోవడం అంత అవసరమా అంటారా.. మరలాంటప్పుడు సెలవు మాత్రం ఎందుకండి?? ( ఆలోచించమని మనవి )

                                                                                                                                 లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అబ్బాయికి 'అప్పగింతలు' !!

అమ్మ కొడుకు...

మన ఊరి 'సంక్రాంతి'!!