Posts

ఒకప్పుడు - ఇప్పుడు - పెళ్ళయ్యాక

Image
ఒకప్పుడు - ఇప్పుడు - పెళ్ళయ్యాక కాలాన్ని బట్టి మనిషి మారుతూ ఉంటాడు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు.. నిజమే నండీ.. కావాలంటే ఇవి చదవండి.. ఒక్కో ప్రాయంలో ఒక్కోలా ఎలా ప్రవర్తించామో మీకే తెలుస్తుంది!! స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు: చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తారని యునిఫాం వేసుకొని స్కూల్ కి వెళ్ళాం అప్పుడు ఆఫీస్ కి సెలవు ఇచ్చారు.. రోజంతా హ్యాప్పీ గా నిద్రపోవచ్చు అని ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి పంపితే ఇంట్లో ఏ అల్లరీ వుండదు అని పెళ్ళయ్యాక!! గాంధీ జయంతి రోజు: స్కూల్ కి సెలవు..స్నేహితులతో క్రికెట్ ఆడుకోవచ్చని అనుకున్నాం అప్పుడు ఆఫీస్ లేదు సరే.. ఆఫీసర్స్ చాయిస్ అయినా దొరికితే బాగుండు అని ఇప్పుడు పనేం లేదు కాబట్టి పెళ్ళాంతో ఫస్టు షోకి వెళ్దాం అని పెళ్ళయ్యాక!! గాంధీ జయంతి రోజు: స్కూల్ కి సెలవు..స్నేహితులతో క్రికెట్ ఆడుకోవచ్చని అనుకున్నాం అప్పుడు ఆఫీస్ లేదు సరే.. ఆఫీసర్స్ చాయిస్ అయినా దొరికితే బాగుండు అని ఇప్పుడు పనేం లేదు కాబట్టి పెళ్ళాంతో ఫస్టు షోకి వెళ్దాం అని పెళ్ళయ్యాక!! మదర్స్ డే రోజు: అలాంటి రోజొకటి వుందని కూడా మనకి తెలీదు అప్పుడు మేనేజెర్ ఇచ్చిన పని చేయడం తోనే సరిపోయ...

వధువులూ మారారు..!!

Image
వధువులూ మారారు..!! మొదటగా అబ్బాయికి అమ్మాయి నచ్చాలి.. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి పిమ్మట అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి కానీ సరే అనం జాతకాలు కలవాలి జ్యోతిష్యుడి సమ్మతం కావాలి ఈ తంతులన్నీ ముగిశాక పెట్టేదెంత పుచ్చుకునేదెంత అనే లావాదేవీలు మాట్లాడుకోవాలి అప్పుడే నిశ్చయ తాంబూలాల మార్పిడి!! ఇప్పటికీ పెళ్ళి కాని సగం మంది అబ్బాయిలకి బోధపడని కొన్ని విషయాలు!! పల్లెలో ప్రశాంతంగా బ్రతుకుదాం అంటే వద్దంటున్నారు పట్టణంలో పరిగెత్తుదాం అంటే ముద్దంటున్నారు!! కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా అంటే వద్దంటున్నారు కడుపు చేసి పారిపోతా అంటే ముద్దంటున్నారు!! ప్రేమానురాగాలు చూపిస్తా అంటే వద్దంటున్నారు పైసల్నే నీకోసం బాగా ఖర్చు చేస్తా అంటే ముద్దంటున్నారు!! ఫ్యామిలీతో గొడవలు ఏం లేవు అంటే వద్దంటున్నారు ఫ్యాక్షన్లో ఆరితేరాను అంటే ముద్దంటున్నారు!! రోగాలే లేని రైతుల్ని వద్దంటున్నారు రోగాల్నే ఆస్తులుగా చెప్పుకునే సాఫ్ట్ వేర్ని ముద్దంటున్నారు!! బంగారమంటి మనసున్న వాడిని వద్దంటున్నారు బంగారం మాత్రమే వున్న బంగార్రాజుల్ని ముద్దంటున్నారు!! కాళ్ళని నమ్ముకున్న వాళ్ళని వద్దంటున్నారు కార్లని నమ్ముక...

పట్టణంలో ఇంటికోసం..!!

Image
పట్టణంలో ఇంటికోసం..!! ఈ కాలంలో 7వ తరగతి కూడా పోటా పోటీనే 10వ తరగతి బాగా చదివితే, ఇంటర్ లో ఫ్రీ సీట్ గ్యారంటీ ఇంటర్ లో బాగా చదివితేనే, ఎంసెట్ లో ర్యాంకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తేనే, మంచి కాలేజ్ లో భ్.టెచ్ సీట్ మంచి కాలేజ్ లో సీట్ వస్తేనే క్యాంపస్ సెలక్షన్స్ కి అవకాశం క్యాంపస్ సెలక్షన్స్ వస్తేనే అద్భుతమైన కొలువు ఇక మొదలు ఉద్యోగ కష్టాలు చెప్పుకోవడానికి సమయముండదు, చూపిద్దాం అంటే తల్లిదండ్రులుండరు!! ఇలా ప్రతీదానికీ హడావిడే.. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం చాలా నయం అని ఏ మహానుభావుడు చెప్పాడో కానీ ఇప్పుడాయన వుంటే పోవయ్యా బా చెప్పావ్ కానీ, పిల్లల్ని చెడగొట్టడానికే వచ్చినట్టున్నావ్ అని తరిమి తరిమి కొడతారు. మనం అంతలా సంపాదించి చేసేదేమిటో తెలుసా అండి పట్టణంలో ఒక ఇల్లు కొనుక్కోవడం. అదే ఇప్పుడు సమాజంలో అందరికీ కావాల్సిన గౌరవం. జీతం తక్కువైతే లోన్ ఐనా తీసుకొని ఇల్లు కొన్నుక్కో కానీ ఇల్లు కొనకుండా వూళ్ళో వున్న ఇంటి గడప తొక్కడానికి వీళ్ళేదని శాసనాలు!! ఇంతలా పరిగెట్టి, తినీ తినక నిద్ర పోయీ పోక కూడబెట్టిన నాలుగు రాళ్ళు పట్టణంలో పోసి ఒక ఇల్లు కొనుక్కునేసరికి 60 ...

మన ఊరి 'సంక్రాంతి'!!

Image
మన ఊరి 'సంక్రాంతి'!! ఆగస్ట్ లో అందరినీ సెలవుల కోసం విసిగించేయడాలు సెప్టెంబర్ నుంచే పండగ గురించి ఆలోచనలు నవంబర్ లో ఏం నాటకాలు వేయాలా మన వాళ్ళ కోసం అని జుట్టు పీక్కోవడాలు డిసంబర్ లో డ్యాన్స్ లు ఏం నేర్చుకోవాలి స్టేజ్ మీద వేయడానికి అని ఆత్రుతలు జనవరి 1st ఒక పండగే కాదన్నట్టు పక్కకి తిరిగి పండగ కోసం ఎదురు చూపులు ఇవండి తెలుగు పల్లెల్లో పుట్టిన ప్రతొక్కడూ ఎదురు చూసే క్షణాలు... కొన్న కొత్త బట్టలు సంచుల్లో సర్దుకొని ఒక పది రోజుల పాటు ఈ పట్టణంతో పనే లేదన్నట్టుగా ముందుగానే మనం బుక్ చేసుకున్న సీట్ ఎక్కడుందా అని తిరుగుతున్న వేళ వస్తుందండి మనల్ని మన వూరికి ఆప్యాయంగా తీసుకెళ్ళే మన మిడిల్ క్లాస్ విమానం అదేనండి "రైలు బండి"!! వూరి దగ్గర్లోని స్టేషన్ లో దిగీ దిగగానే, మన పరిసరాల్లోకి వచ్చేశామనే భావన ఇక అక్కడినుంచి కాలు ఆగదు.. ప్రతీ బస్సు మనూరికే వెళ్తే బాగుండు అని అనుకోవడాలు సీట్ లు లేవని కండక్టర్ చెప్పినా పర్లేదండి అని బ్యాగ్ లు పైన పెట్టి నుంచోడానికి సిద్దమవడాలు బస్సు కొట్టే హారన్ అయినా వినసొంపైన సంగీతంలా వినబడడాలు చేలల్లో వూగే పైరు మనకి స్వాగతం చెప్తున్నట్టు చెయ్యి వూపడాలు కాలుష...

విదేశీయానం..!!

Image
విదేశీయానం..!! విమానమెక్కి పోతున్నానన్న ఆనందం కన్నా వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూడలేనన్న బాధే ఎక్కువ విశాఖపట్టణంలో చదువుకోసం కూడా దూరంగా వుండలేని మనం విదేశాల పేరిట దూరమవడం భారతదేశంలో వున్న రూపాయి కంటే విదేశాళ్ళో దొరికే విలువైన డాలర్సే మనకెక్కువ అర్ధవంతమైన తెలుగులో మాట్లాడకుండా అర్ధం పర్ధం లేని ఆంగ్లంలో పలకరింపులు కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోవడం కంటే కోట్లు సంపాదించడం పైనే ద్యాస వాడికెప్పటికో వూరిమీద బుద్ది పుట్టి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా సంవత్సరం తర్వాత తోడ పుట్టినోడి పెళ్ళికి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా ముద్దుల చెల్లెలు పెద్దమనిషి అయినప్పుడు వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా చెల్లిని ప్రేమగా చూసుకోబోయే బావకి కాళ్ళు కడగాలి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా మీకు అనారోగ్యంగా వుందని తెలిసి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా అదే మంచంలో పడ్డాక చివరి చూపు కోసం మీ బిడ్డలు రావాలని కోరుకున్నప్పుడు, ఈసారి వాళ్ళ వం...

పిరికివాడు..!!

Image
పిరికివాడు..!! ఈరోజు నాకు తాగాలనిపిస్తుందిరా అన్నాడో స్నేహితుడు..ఎందుకు అని అడిగితే, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదనింది అని సమాధానం.. దానికి తాగడం ఎందుకు? తాగితే కాదు అన్న అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి ప్రేమిస్తున్నా అంటుందా?? ఇంకొంతమంది, డబ్బు కష్టాలు లేదంటే కుటుంబ కష్టాలు అంటారు.. రెండూ పచ్చి అబద్దాలే.. డబ్బు కష్టాలు నిజంగా ఉన్నవాడైతే, వేలకు వేలు తగలేస్తూ ఈ తాగుడికి బానిస అవుతాడా?? తాగడానికి పెట్టే ఖర్చులో సగం చాలు వాడి డబ్బు కష్టాల్ని మొత్తం తీర్చుకోవడానికి.. కుటుంబ కష్టాలు, అవే పెళ్ళాలతో గొడవలు... నువ్వు ఈ రకంగా రోజూ తాగి ఇంటికెళ్తుంటే ఆ స్త్రీమూర్తి మాత్రం ఎందాకని  భరిస్తుంది.. అందుకే మానెయ్యమనో లేదంటే తక్కువ తాగమనో చెప్తుంది... అర్ధం చేసుకోవడం మానేసి అరిచేస్తావు నువ్వు.. గొడవలు కాక ఇంకేముందీ.. కష్టాలు రాగానే మందు తాగి వాటిని మర్చిపోవడం ఏంటి? సరే తాగారు మర్చిపోయారు.. రేపు పొద్దున్నే లేవగానే ఆ కష్టాలు సుఖాలుగా మారిపోతున్నాయా? లేదే.. అవి అలాగే ఉంటాయ్.. ఇలా తాగడానికి మనం వెతుక్కునే సాకులు ఎన్నో.. నిజంగానే కష్టాలు వచ్చాయి అనుకోండి తాగుడు దానికి పరిష్కారం కానే కాదు పిరికివ...

అబ్బాయికి 'అప్పగింతలు' !!

Image
అబ్బాయికి 'అప్పగింతలు' వేద మంత్రాల సందడిలో కట్టిన తాళి మెడను అలంకరించిన వేళ కనిపించని అరుంధతిని పతి చూపిస్తుంటే కనిపించిందనే తలూపిన వేళ సిగ్గుతో కాకుండా ఆందోళనతో పెళ్ళి కూతురు తలదించుకున్న వేళ సంభావన ఎంతిస్తారో అనే తలంపులతో బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతున్న వేళ భోజనాలలో ఏం వడ్డిస్తారో అని ఎదురుచూస్తున్న పెళ్ళి పెద్దలు చుట్టూ వున్న వేళ చదివింపులు ఎంత చదివిద్దాం అని మన బంధువులు ఆలోచిస్తున్న వేళ భాద్యత తీరిపోయిందని తినకుండానే కడుపు నిండిందనుకునే పిల్ల తల్లిదండ్రుల ఆనంద వేళ మెట్టినింట మహాలక్ష్మి అడుగుపెట్టనుందనే అత్తా మామలు సంబర పడుతున్న వేళ ఇప్పటి వరకూ నవ్వింది చాలు కొంచెం సేపైనా ఏడవండి అని నవ్వుకుంటూ వచ్చే ఘట్టమే 'అప్పగింతలు' మమ్మల్నొదిలి అమ్మాయి ఎప్పుడూ వుండలేదు అల్లుడు గారూ... జాగ్రత్తగా చూసుకోవయ్యా... ఏదైనా తప్పు చేస్తే మెల్లిగా చెప్పండి అల్లుడుగారు అమ్మాయిని ఇప్పటివరకూ పల్లెత్తి మాటనలేదు.. చేయెత్తి కొట్టనూ లేదు. ఇక నుంచి చావైనా బ్రతుకైనా నీకు మెట్టినిల్లే తల్లి, అని అమ్మాయిని భారంగా సాగనంపుతుంటే తల్లిదండ్రుల్ని విడిచి కొత్త ప్రప్రంచం లోకి అడుగుపెడుతుంది ప్రతీ అమ్మ...