Posts

Showing posts from March, 2018

ఒకప్పుడు - ఇప్పుడు - పెళ్ళయ్యాక

Image
ఒకప్పుడు - ఇప్పుడు - పెళ్ళయ్యాక కాలాన్ని బట్టి మనిషి మారుతూ ఉంటాడు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు.. నిజమే నండీ.. కావాలంటే ఇవి చదవండి.. ఒక్కో ప్రాయంలో ఒక్కోలా ఎలా ప్రవర్తించామో మీకే తెలుస్తుంది!! స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు: చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తారని యునిఫాం వేసుకొని స్కూల్ కి వెళ్ళాం అప్పుడు ఆఫీస్ కి సెలవు ఇచ్చారు.. రోజంతా హ్యాప్పీ గా నిద్రపోవచ్చు అని ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి పంపితే ఇంట్లో ఏ అల్లరీ వుండదు అని పెళ్ళయ్యాక!! గాంధీ జయంతి రోజు: స్కూల్ కి సెలవు..స్నేహితులతో క్రికెట్ ఆడుకోవచ్చని అనుకున్నాం అప్పుడు ఆఫీస్ లేదు సరే.. ఆఫీసర్స్ చాయిస్ అయినా దొరికితే బాగుండు అని ఇప్పుడు పనేం లేదు కాబట్టి పెళ్ళాంతో ఫస్టు షోకి వెళ్దాం అని పెళ్ళయ్యాక!! గాంధీ జయంతి రోజు: స్కూల్ కి సెలవు..స్నేహితులతో క్రికెట్ ఆడుకోవచ్చని అనుకున్నాం అప్పుడు ఆఫీస్ లేదు సరే.. ఆఫీసర్స్ చాయిస్ అయినా దొరికితే బాగుండు అని ఇప్పుడు పనేం లేదు కాబట్టి పెళ్ళాంతో ఫస్టు షోకి వెళ్దాం అని పెళ్ళయ్యాక!! మదర్స్ డే రోజు: అలాంటి రోజొకటి వుందని కూడా మనకి తెలీదు అప్పుడు మేనేజెర్ ఇచ్చిన పని చేయడం తోనే సరిపోయ

వధువులూ మారారు..!!

Image
వధువులూ మారారు..!! మొదటగా అబ్బాయికి అమ్మాయి నచ్చాలి.. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి పిమ్మట అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి కానీ సరే అనం జాతకాలు కలవాలి జ్యోతిష్యుడి సమ్మతం కావాలి ఈ తంతులన్నీ ముగిశాక పెట్టేదెంత పుచ్చుకునేదెంత అనే లావాదేవీలు మాట్లాడుకోవాలి అప్పుడే నిశ్చయ తాంబూలాల మార్పిడి!! ఇప్పటికీ పెళ్ళి కాని సగం మంది అబ్బాయిలకి బోధపడని కొన్ని విషయాలు!! పల్లెలో ప్రశాంతంగా బ్రతుకుదాం అంటే వద్దంటున్నారు పట్టణంలో పరిగెత్తుదాం అంటే ముద్దంటున్నారు!! కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా అంటే వద్దంటున్నారు కడుపు చేసి పారిపోతా అంటే ముద్దంటున్నారు!! ప్రేమానురాగాలు చూపిస్తా అంటే వద్దంటున్నారు పైసల్నే నీకోసం బాగా ఖర్చు చేస్తా అంటే ముద్దంటున్నారు!! ఫ్యామిలీతో గొడవలు ఏం లేవు అంటే వద్దంటున్నారు ఫ్యాక్షన్లో ఆరితేరాను అంటే ముద్దంటున్నారు!! రోగాలే లేని రైతుల్ని వద్దంటున్నారు రోగాల్నే ఆస్తులుగా చెప్పుకునే సాఫ్ట్ వేర్ని ముద్దంటున్నారు!! బంగారమంటి మనసున్న వాడిని వద్దంటున్నారు బంగారం మాత్రమే వున్న బంగార్రాజుల్ని ముద్దంటున్నారు!! కాళ్ళని నమ్ముకున్న వాళ్ళని వద్దంటున్నారు కార్లని నమ్ముక