Posts

Showing posts from December, 2017

విదేశీయానం..!!

Image
విదేశీయానం..!! విమానమెక్కి పోతున్నానన్న ఆనందం కన్నా వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూడలేనన్న బాధే ఎక్కువ విశాఖపట్టణంలో చదువుకోసం కూడా దూరంగా వుండలేని మనం విదేశాల పేరిట దూరమవడం భారతదేశంలో వున్న రూపాయి కంటే విదేశాళ్ళో దొరికే విలువైన డాలర్సే మనకెక్కువ అర్ధవంతమైన తెలుగులో మాట్లాడకుండా అర్ధం పర్ధం లేని ఆంగ్లంలో పలకరింపులు కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోవడం కంటే కోట్లు సంపాదించడం పైనే ద్యాస వాడికెప్పటికో వూరిమీద బుద్ది పుట్టి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా సంవత్సరం తర్వాత తోడ పుట్టినోడి పెళ్ళికి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా ముద్దుల చెల్లెలు పెద్దమనిషి అయినప్పుడు వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా చెల్లిని ప్రేమగా చూసుకోబోయే బావకి కాళ్ళు కడగాలి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా మీకు అనారోగ్యంగా వుందని తెలిసి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా అదే మంచంలో పడ్డాక చివరి చూపు కోసం మీ బిడ్డలు రావాలని కోరుకున్నప్పుడు, ఈసారి వాళ్ళ వం

పిరికివాడు..!!

Image
పిరికివాడు..!! ఈరోజు నాకు తాగాలనిపిస్తుందిరా అన్నాడో స్నేహితుడు..ఎందుకు అని అడిగితే, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదనింది అని సమాధానం.. దానికి తాగడం ఎందుకు? తాగితే కాదు అన్న అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి ప్రేమిస్తున్నా అంటుందా?? ఇంకొంతమంది, డబ్బు కష్టాలు లేదంటే కుటుంబ కష్టాలు అంటారు.. రెండూ పచ్చి అబద్దాలే.. డబ్బు కష్టాలు నిజంగా ఉన్నవాడైతే, వేలకు వేలు తగలేస్తూ ఈ తాగుడికి బానిస అవుతాడా?? తాగడానికి పెట్టే ఖర్చులో సగం చాలు వాడి డబ్బు కష్టాల్ని మొత్తం తీర్చుకోవడానికి.. కుటుంబ కష్టాలు, అవే పెళ్ళాలతో గొడవలు... నువ్వు ఈ రకంగా రోజూ తాగి ఇంటికెళ్తుంటే ఆ స్త్రీమూర్తి మాత్రం ఎందాకని  భరిస్తుంది.. అందుకే మానెయ్యమనో లేదంటే తక్కువ తాగమనో చెప్తుంది... అర్ధం చేసుకోవడం మానేసి అరిచేస్తావు నువ్వు.. గొడవలు కాక ఇంకేముందీ.. కష్టాలు రాగానే మందు తాగి వాటిని మర్చిపోవడం ఏంటి? సరే తాగారు మర్చిపోయారు.. రేపు పొద్దున్నే లేవగానే ఆ కష్టాలు సుఖాలుగా మారిపోతున్నాయా? లేదే.. అవి అలాగే ఉంటాయ్.. ఇలా తాగడానికి మనం వెతుక్కునే సాకులు ఎన్నో.. నిజంగానే కష్టాలు వచ్చాయి అనుకోండి తాగుడు దానికి పరిష్కారం కానే కాదు పిరికివాడు

అబ్బాయికి 'అప్పగింతలు' !!

Image
అబ్బాయికి 'అప్పగింతలు' వేద మంత్రాల సందడిలో కట్టిన తాళి మెడను అలంకరించిన వేళ కనిపించని అరుంధతిని పతి చూపిస్తుంటే కనిపించిందనే తలూపిన వేళ సిగ్గుతో కాకుండా ఆందోళనతో పెళ్ళి కూతురు తలదించుకున్న వేళ సంభావన ఎంతిస్తారో అనే తలంపులతో బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతున్న వేళ భోజనాలలో ఏం వడ్డిస్తారో అని ఎదురుచూస్తున్న పెళ్ళి పెద్దలు చుట్టూ వున్న వేళ చదివింపులు ఎంత చదివిద్దాం అని మన బంధువులు ఆలోచిస్తున్న వేళ భాద్యత తీరిపోయిందని తినకుండానే కడుపు నిండిందనుకునే పిల్ల తల్లిదండ్రుల ఆనంద వేళ మెట్టినింట మహాలక్ష్మి అడుగుపెట్టనుందనే అత్తా మామలు సంబర పడుతున్న వేళ ఇప్పటి వరకూ నవ్వింది చాలు కొంచెం సేపైనా ఏడవండి అని నవ్వుకుంటూ వచ్చే ఘట్టమే 'అప్పగింతలు' మమ్మల్నొదిలి అమ్మాయి ఎప్పుడూ వుండలేదు అల్లుడు గారూ... జాగ్రత్తగా చూసుకోవయ్యా... ఏదైనా తప్పు చేస్తే మెల్లిగా చెప్పండి అల్లుడుగారు అమ్మాయిని ఇప్పటివరకూ పల్లెత్తి మాటనలేదు.. చేయెత్తి కొట్టనూ లేదు. ఇక నుంచి చావైనా బ్రతుకైనా నీకు మెట్టినిల్లే తల్లి, అని అమ్మాయిని భారంగా సాగనంపుతుంటే తల్లిదండ్రుల్ని విడిచి కొత్త ప్రప్రంచం లోకి అడుగుపెడుతుంది ప్రతీ అమ్మ

ఎవరు గొప్ప మన ప్రభుత్వానికి..??

Image
ఎవరు గొప్ప మన ప్రభుత్వానికి..?? నాకు తెలిసిన ఒక పెద్దాయన, బ్యాంక్ ని మోసం చేసి ఒక కోటి రూపాయలు నొక్కేసారు.. తీరా అది 3 సంవత్సరాలకి బయటడ్డాక, పోలీసులు అతన్ని ఒక సంవత్సరం జైల్ లో పెట్టారు మరియు అతను మోసం చేసిన డబ్బులు మొత్తం వెనక్కి కట్టమని చెప్పారు.. అర్ధం కాని విషయమేంటంటే, మరి అతను ఈ 3 సంవత్సరాలలో ఆ కోటి రూపాయలమీద సంపాదించిన డబ్బు సంగతేంటి?? మంచి ఇల్లు కట్టుకున్నారు పైగా తన కూతురికి పెళ్ళి కూడా చేసేసారు.. ఇప్పుడు ఆయన ఆ ఊరిలోనే బాగా డబ్బు ఉన్న మనుషుల్లో ఒకరు!! ఇదే విధంగా, ఈ మధ్యనే జార్ఖండ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన పధకాన్ని ప్రవేశపెట్టారు.. అదేంటంటే, నక్సలైట్లు లొంగిపోతే వాళ్ళు ఏ శిక్షలూ లేకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు.. పైగా వాళ్ళు నక్సలిజమ్ని వదిలి వచ్చినందుకు తలకో 20 లక్షలు ఇస్తామని ప్రభుత్వ నిర్ణయం. దీనికి తోడు వాళ్ళ పిల్లలకి ఉచిత చదువులూ ఒక ఉద్యోగం.. మనుషుల ప్రాణాలు తీసే వాళ్ళకోసం ఇన్ని పథకాలు పెట్టే మన ప్రభుత్వాలు, ప్రాణాలు నిలబెట్టే ధాన్యాన్ని పండిస్తున్న రైతులకి  ఏమైనా చేస్తుందా..?? రైతులకి రవ్వంత కూడా సాయపడనీ, కష్టపడే వాళ్ళమీద కనీసం కనికరం కూడా చూపించలేని ఈ ప్రభుత్వాల

మారాల్సిందెవరు..?

Image
మారాల్సిందెవరు..? 3 యేళ్ళు నిండకుండానే 3 కేజిల బరువు సంచితో పాఠశాలకు మాటలు పలకలేని వయస్సులోనే పాఠాలు నేర్పిచాలనే తపన అయిదేళ్ళవరకు ఆగితే అందకుండా పోతాడేమోననే భయం వూళ్ళో వుండి చదువుకుంటే వెదవ అవుతాడేమోననే అనుమానం హాస్టల్ లో వుంచి చదివిస్తే హై లెవల్ కి వెల్తాడనే ఆశ పదే పదే గుర్తొస్తున్నా పిల్లల భవిష్యత్తుకి తప్పదనే బాధ తల్లిదండ్రులున్నా తల దువ్వే అమ్మ పక్కనలేదనే ఆవేదన ప్రేమని చూపించే వాళ్ళు కరువైన ఆ దౌర్భాగ్య క్షణాన దారిన పోయే ఎవడు ప్రేమగా మాట్లాడినా మంచి అని అనుకునే మాయలో ప్రేమ ఇది మా హక్కు అనే ఊబిలో పడుతున్న ఈనాటి యువతరం!! తప్పు ఎవరిదండి ఇక్కడ..? పెద్ద కొలువు అనే ఆశతో చిన్న చిన్న ప్రేమలకి దూరం చేస్తున్న తల్లిదండ్రులదా..? తల్లిదండ్రుల ప్రేమని కాకుండా వాళ్ళు పంపించే పైసల్నే చూస్తున్న మన యువతదా..? అయిదు సంవత్సరాలకి పాఠశాలకి పంపిస్తే ఏం అవుద్దండి, 2 సంవత్సరాలు చదువులో వెనకబడతాడా.. ఆ రెండు సంవత్సరాలు అమ్మ ప్రేమంటే ఏంటో నిజ జీవితంలో చదువుకుంటాడు. మమ్మీ అనే పదం బదులు అమ్మ అని పిలవడం నేర్చుకుంటాడు! వూళ్ళో వుండి చదువుకుంటే వెదవే ఎందుకౌతాడండి.. వ్యవసాయం గురించి తెలుసుకుంటాడు, రైతుల్ని గౌరవి