ఎవరు గొప్ప మన ప్రభుత్వానికి..??

ఎవరు గొప్ప మన ప్రభుత్వానికి..??


నాకు తెలిసిన ఒక పెద్దాయన, బ్యాంక్ ని మోసం చేసి ఒక కోటి రూపాయలు నొక్కేసారు..
తీరా అది 3 సంవత్సరాలకి బయటడ్డాక, పోలీసులు అతన్ని ఒక సంవత్సరం జైల్ లో పెట్టారు మరియు అతను మోసం చేసిన డబ్బులు మొత్తం వెనక్కి కట్టమని చెప్పారు..
అర్ధం కాని విషయమేంటంటే, మరి అతను ఈ 3 సంవత్సరాలలో ఆ కోటి రూపాయలమీద సంపాదించిన డబ్బు సంగతేంటి??
మంచి ఇల్లు కట్టుకున్నారు పైగా తన కూతురికి పెళ్ళి కూడా చేసేసారు.. ఇప్పుడు ఆయన ఆ ఊరిలోనే బాగా డబ్బు ఉన్న మనుషుల్లో ఒకరు!!

ఇదే విధంగా, ఈ మధ్యనే జార్ఖండ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన పధకాన్ని ప్రవేశపెట్టారు..
అదేంటంటే, నక్సలైట్లు లొంగిపోతే వాళ్ళు ఏ శిక్షలూ లేకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు.. పైగా వాళ్ళు నక్సలిజమ్ని వదిలి వచ్చినందుకు
తలకో 20 లక్షలు ఇస్తామని ప్రభుత్వ నిర్ణయం. దీనికి తోడు వాళ్ళ పిల్లలకి ఉచిత చదువులూ ఒక ఉద్యోగం..

మనుషుల ప్రాణాలు తీసే వాళ్ళకోసం ఇన్ని పథకాలు పెట్టే మన ప్రభుత్వాలు, ప్రాణాలు నిలబెట్టే ధాన్యాన్ని పండిస్తున్న రైతులకి  ఏమైనా చేస్తుందా..??
రైతులకి రవ్వంత కూడా సాయపడనీ, కష్టపడే వాళ్ళమీద కనీసం కనికరం కూడా చూపించలేని ఈ ప్రభుత్వాలు
జనాల్ని మోసం చేసేవాళ్ళకి, అసలు ఎవరికోసం పోరాడుతున్నారో కూడా తెలియని నక్సలైట్లకి మాత్రం ఎందుకంత గౌరవాలు ఇస్తుంది??

అయ్యా ప్రభుత్వ పెద్దలారా... మీరు మోసం చేస్తుంది మహామహుల్ని కాదు, కష్టపడి కూలీ నాలీ చేసుకునే మన సామాన్య జనాల్ని..
ఎవరైనా మంచి భవిష్యత్తు వస్తుంది అనే ఆశతోనే కష్టపడతారు.. మీరు చేసే ఇలాంటి పిచ్చి పనుల వల్ల అవి ఎప్పటికీ రావు అని
వాళ్ళు గ్రహించినా లేదా వాళ్ళకి కూడా ఈ పద్దతి నచ్చి ఇలా మోసం చేయడానికో, నక్సలిజానికో అలవాటు పడ్డారనుకోండి మొదటికే మోసం వస్తుంది ఆలోచించుకోండి.
ఇది ఇలాగే పోతే కష్టపడే వాళ్ళు ఒకప్పుడు ఉండే వాళ్ళు అని మనం కూడా పుస్తకాల్లో చదువుకోవాల్సిరావడం తధ్యం!!

                                                                                                                               లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అబ్బాయికి 'అప్పగింతలు' !!

అమ్మ కొడుకు...

మన ఊరి 'సంక్రాంతి'!!