Posts

Showing posts from July, 2018

బద్దకమే అభివృద్దా??

Image
బద్దకమే అభివృద్దా?? తప్పక చేస్తున్నామో తప్పనిసరై చేస్తున్నామో మనకి మనమే తెలుసుకోలేని కొన్ని విషయాలివన్నీ.. అభివృద్ది అని ముందుకెళ్తున్నామో.. ఎంత చేసినా మన పెద్దవాళ్ళ ఆయుషుని అందుకోలేకపోతున్నామో తెలీదు కానీ.. బద్దకమే మనం సాధించిన అతి పెద్ద అభివృద్ది అని చెప్పడంలో ఎటువంటి అతిశయం లేదు.!! చదివాక మీ మాట కూడా అదే కావొచ్చు!! వేప పుల్లలతో పళ్ళు తోముకుంటే చాలా మంచిది అని తెలుసూ.. కానీ వంట గదిలో వున్న వస్తువులన్నీ పేస్ట్ లో కుక్కి బ్రష్ మీద వేస్తేనే మనకిష్టం.. పుల్లలతో తోముకుంటే మన కంటబడని ఎన్నో దంత రోగాలు వీటి వాడకం మొదలవ్వగానే వచ్చాయని బాధపడాలో సమయం చాలా ఆదా అయిందని ఆనందపడాలో అర్ధం కాని పరిస్థితి!! కుంకుడు కాయలతో తలస్నానం అన్ని పోషకాలు జుట్టుకి అందివ్వడం అని తెలుసూ.. షాంపూ ఐతే కళ్ళు మండవు.. పైగా చాలా త్వరగా అయిపోద్ది అని, షాంపూలతో ఆరోగ్యంగా వున్నదాన్ని చెడగొట్టి బట్ట తలలు తెచ్చుకుంటున్నాం అని బాధపడాలో బోడి గుండయ్యాక రోజూ దువ్వుకునే బాధ తప్పిందని ఆనందపడాలో అర్ధం కాని పరిస్థితి!! పట్టుమని పదినిమిషాల నడకైనా వుండధు... కార్ బుక్ చేస్తాం లేదంటే ఆటో కావాల్సిందే.. బద్దకం వల్ల రోగ