Posts

Showing posts from July, 2017

ఆ రోజులు..!!

Image
ఆ రోజులు..!! ఒంటిపూట బడుల కోసం ఒంటి కాలుపై ఎదురు చూసిన ఆ రోజులు, ఎండాకాలం సెలవుల్లో నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన ఆ రోజులు, రూపాయికి రెండు పుల్ల ఐసులు కొనుక్కున్న ఆ రోజులు, చిరిగిన నిక్కర్లతో బడికి వెళ్ళిన ఆ రోజులు, బియ్యం సంచితో స్కూల్ బ్యాగ్ ని కుట్టించుకున్న ఆ రోజులు, పక్కన ఉన్న అమ్మాయిని స్నేహితురాలిగా మాత్రమే చూసిన ఆ రోజులు, కరెంట్ లేకపోయినా చెమటలు కారేలా క్రికెట్ ఆడిన ఆ రోజులు, ప్రైవేట్ లో కరెంట్ పోగానే కొవ్వొత్తి ముందు గుమిగూడి ముచ్చట్లాడిన ఆ రోజులు, కరుగుతున్న కొవ్వొత్తిని గిన్నె కొవ్వొత్తిలా మార్చేసిన ఆ రోజులు, చీకటైతే చల్లని గాలికోసం ఆరుబయట మంచాలేసిన ఆ రోజులు, అమ్మ పక్కన పడుకున్నట్టు నటిస్తూ కొంగుకున్న చిల్లర నొక్కేసిన ఆ రోజులు.. ఆ రోజులకీ ఈ రోజులకీ పోలికా? అవి గోమాత నుంచి వచ్చే పవిత్రమైన గోమూత్రమైతే, ఇవి మనమే కల్తీ చేసిన జెర్సీ ఆవుల నుంచి వస్తున్న పాలదారవంటివి.. సెల్ ఫోన్లు లేకపోయినా ఉత్తరాలతో ఊరిలో ఉన్న చుట్టాలని చుట్టేసిన రోజులవైతే, బంధువులకి దూరంగా ఉన్నామో భార్యాబిడ్డలకి దగ్గరగా ఉన్నామో అర్ధం కాని రోజులివి!! అనుబంధాలకోసం, ఆప్యాయతలకోసం ఆస్తులని సైతం వదులుకున్న రోజులవైతే, అవ

ఎవరిదీ తప్పు..?

Image
ఎవరిదీ తప్పు..? న్యూస్ పేపర్స్ లోనో చానల్స్ లోనో పైన ఉన్న చిత్రాన్ని మీరు చూసే ఉంటారు.. అది తల్లిదండ్రులు అంత్యంత కర్కశంగా తమ సొంత బిడ్డనే కడతేర్చిన వైనం... వేరే కులం అబ్బాయిని, పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్న ఒక నారీమణికి భారతదేశంలో పట్టిన గతి... ప్రేమ విషయం చెప్పగానే ఇంట్లో వాళ్ళు వద్దంటారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా... 20 సంవత్సరాలు మన అమ్మాయిగా పెరిగిన పిల్ల ఒకతన్ని ప్రేమించాను అంటే ఆరా తీయడం మానేసి ఆవేశంతో ఊగిపోయే పరిస్థితి.. మన పెద్దవాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా?? వాళ్ళ భయం వాళ్ళది... ఉన్న ఒక్కగానొక్క నలుసు ప్రేమ అనే మాయలో పడి తన బంగారు జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటుందో అని... అంతే కానీ ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డలకి మంచి జీవితం దొరుకుంతుంది అంతే దాన్ని కాలరాయాలని చూడరు.. పారిపోయి పెళ్ళి చేసుకోవడం!!! ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి.. వాళ్ళని ఎలాగైనా ఒప్పించడానికి ప్రయత్నిచాలి కానీ వాళ్ళని వదిలేసి నీ దారి నువ్వు చూసుకోవడం ఏంటి? చిన్నప్పటినుంచీ నువ్వు ఏం అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రేమించిన అబ్బాయిని కాదంటున్నారు అంటే