Posts

Showing posts from 2017

విదేశీయానం..!!

Image
విదేశీయానం..!! విమానమెక్కి పోతున్నానన్న ఆనందం కన్నా వీళ్ళని మళ్ళీ మళ్ళీ చూడలేనన్న బాధే ఎక్కువ విశాఖపట్టణంలో చదువుకోసం కూడా దూరంగా వుండలేని మనం విదేశాల పేరిట దూరమవడం భారతదేశంలో వున్న రూపాయి కంటే విదేశాళ్ళో దొరికే విలువైన డాలర్సే మనకెక్కువ అర్ధవంతమైన తెలుగులో మాట్లాడకుండా అర్ధం పర్ధం లేని ఆంగ్లంలో పలకరింపులు కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోవడం కంటే కోట్లు సంపాదించడం పైనే ద్యాస వాడికెప్పటికో వూరిమీద బుద్ది పుట్టి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా సంవత్సరం తర్వాత తోడ పుట్టినోడి పెళ్ళికి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా ముద్దుల చెల్లెలు పెద్దమనిషి అయినప్పుడు వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా చెల్లిని ప్రేమగా చూసుకోబోయే బావకి కాళ్ళు కడగాలి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా మీకు అనారోగ్యంగా వుందని తెలిసి వస్తా అంటే అమ్మో డబ్బు ఖర్చు వద్దనే వద్దు, స్కైప్ లో వీడియో వుందిగా అదే మంచంలో పడ్డాక చివరి చూపు కోసం మీ బిడ్డలు రావాలని కోరుకున్నప్పుడు, ఈసారి వాళ్ళ వం

పిరికివాడు..!!

Image
పిరికివాడు..!! ఈరోజు నాకు తాగాలనిపిస్తుందిరా అన్నాడో స్నేహితుడు..ఎందుకు అని అడిగితే, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదనింది అని సమాధానం.. దానికి తాగడం ఎందుకు? తాగితే కాదు అన్న అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి ప్రేమిస్తున్నా అంటుందా?? ఇంకొంతమంది, డబ్బు కష్టాలు లేదంటే కుటుంబ కష్టాలు అంటారు.. రెండూ పచ్చి అబద్దాలే.. డబ్బు కష్టాలు నిజంగా ఉన్నవాడైతే, వేలకు వేలు తగలేస్తూ ఈ తాగుడికి బానిస అవుతాడా?? తాగడానికి పెట్టే ఖర్చులో సగం చాలు వాడి డబ్బు కష్టాల్ని మొత్తం తీర్చుకోవడానికి.. కుటుంబ కష్టాలు, అవే పెళ్ళాలతో గొడవలు... నువ్వు ఈ రకంగా రోజూ తాగి ఇంటికెళ్తుంటే ఆ స్త్రీమూర్తి మాత్రం ఎందాకని  భరిస్తుంది.. అందుకే మానెయ్యమనో లేదంటే తక్కువ తాగమనో చెప్తుంది... అర్ధం చేసుకోవడం మానేసి అరిచేస్తావు నువ్వు.. గొడవలు కాక ఇంకేముందీ.. కష్టాలు రాగానే మందు తాగి వాటిని మర్చిపోవడం ఏంటి? సరే తాగారు మర్చిపోయారు.. రేపు పొద్దున్నే లేవగానే ఆ కష్టాలు సుఖాలుగా మారిపోతున్నాయా? లేదే.. అవి అలాగే ఉంటాయ్.. ఇలా తాగడానికి మనం వెతుక్కునే సాకులు ఎన్నో.. నిజంగానే కష్టాలు వచ్చాయి అనుకోండి తాగుడు దానికి పరిష్కారం కానే కాదు పిరికివాడు

అబ్బాయికి 'అప్పగింతలు' !!

Image
అబ్బాయికి 'అప్పగింతలు' వేద మంత్రాల సందడిలో కట్టిన తాళి మెడను అలంకరించిన వేళ కనిపించని అరుంధతిని పతి చూపిస్తుంటే కనిపించిందనే తలూపిన వేళ సిగ్గుతో కాకుండా ఆందోళనతో పెళ్ళి కూతురు తలదించుకున్న వేళ సంభావన ఎంతిస్తారో అనే తలంపులతో బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతున్న వేళ భోజనాలలో ఏం వడ్డిస్తారో అని ఎదురుచూస్తున్న పెళ్ళి పెద్దలు చుట్టూ వున్న వేళ చదివింపులు ఎంత చదివిద్దాం అని మన బంధువులు ఆలోచిస్తున్న వేళ భాద్యత తీరిపోయిందని తినకుండానే కడుపు నిండిందనుకునే పిల్ల తల్లిదండ్రుల ఆనంద వేళ మెట్టినింట మహాలక్ష్మి అడుగుపెట్టనుందనే అత్తా మామలు సంబర పడుతున్న వేళ ఇప్పటి వరకూ నవ్వింది చాలు కొంచెం సేపైనా ఏడవండి అని నవ్వుకుంటూ వచ్చే ఘట్టమే 'అప్పగింతలు' మమ్మల్నొదిలి అమ్మాయి ఎప్పుడూ వుండలేదు అల్లుడు గారూ... జాగ్రత్తగా చూసుకోవయ్యా... ఏదైనా తప్పు చేస్తే మెల్లిగా చెప్పండి అల్లుడుగారు అమ్మాయిని ఇప్పటివరకూ పల్లెత్తి మాటనలేదు.. చేయెత్తి కొట్టనూ లేదు. ఇక నుంచి చావైనా బ్రతుకైనా నీకు మెట్టినిల్లే తల్లి, అని అమ్మాయిని భారంగా సాగనంపుతుంటే తల్లిదండ్రుల్ని విడిచి కొత్త ప్రప్రంచం లోకి అడుగుపెడుతుంది ప్రతీ అమ్మ

ఎవరు గొప్ప మన ప్రభుత్వానికి..??

Image
ఎవరు గొప్ప మన ప్రభుత్వానికి..?? నాకు తెలిసిన ఒక పెద్దాయన, బ్యాంక్ ని మోసం చేసి ఒక కోటి రూపాయలు నొక్కేసారు.. తీరా అది 3 సంవత్సరాలకి బయటడ్డాక, పోలీసులు అతన్ని ఒక సంవత్సరం జైల్ లో పెట్టారు మరియు అతను మోసం చేసిన డబ్బులు మొత్తం వెనక్కి కట్టమని చెప్పారు.. అర్ధం కాని విషయమేంటంటే, మరి అతను ఈ 3 సంవత్సరాలలో ఆ కోటి రూపాయలమీద సంపాదించిన డబ్బు సంగతేంటి?? మంచి ఇల్లు కట్టుకున్నారు పైగా తన కూతురికి పెళ్ళి కూడా చేసేసారు.. ఇప్పుడు ఆయన ఆ ఊరిలోనే బాగా డబ్బు ఉన్న మనుషుల్లో ఒకరు!! ఇదే విధంగా, ఈ మధ్యనే జార్ఖండ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన పధకాన్ని ప్రవేశపెట్టారు.. అదేంటంటే, నక్సలైట్లు లొంగిపోతే వాళ్ళు ఏ శిక్షలూ లేకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు.. పైగా వాళ్ళు నక్సలిజమ్ని వదిలి వచ్చినందుకు తలకో 20 లక్షలు ఇస్తామని ప్రభుత్వ నిర్ణయం. దీనికి తోడు వాళ్ళ పిల్లలకి ఉచిత చదువులూ ఒక ఉద్యోగం.. మనుషుల ప్రాణాలు తీసే వాళ్ళకోసం ఇన్ని పథకాలు పెట్టే మన ప్రభుత్వాలు, ప్రాణాలు నిలబెట్టే ధాన్యాన్ని పండిస్తున్న రైతులకి  ఏమైనా చేస్తుందా..?? రైతులకి రవ్వంత కూడా సాయపడనీ, కష్టపడే వాళ్ళమీద కనీసం కనికరం కూడా చూపించలేని ఈ ప్రభుత్వాల

మారాల్సిందెవరు..?

Image
మారాల్సిందెవరు..? 3 యేళ్ళు నిండకుండానే 3 కేజిల బరువు సంచితో పాఠశాలకు మాటలు పలకలేని వయస్సులోనే పాఠాలు నేర్పిచాలనే తపన అయిదేళ్ళవరకు ఆగితే అందకుండా పోతాడేమోననే భయం వూళ్ళో వుండి చదువుకుంటే వెదవ అవుతాడేమోననే అనుమానం హాస్టల్ లో వుంచి చదివిస్తే హై లెవల్ కి వెల్తాడనే ఆశ పదే పదే గుర్తొస్తున్నా పిల్లల భవిష్యత్తుకి తప్పదనే బాధ తల్లిదండ్రులున్నా తల దువ్వే అమ్మ పక్కనలేదనే ఆవేదన ప్రేమని చూపించే వాళ్ళు కరువైన ఆ దౌర్భాగ్య క్షణాన దారిన పోయే ఎవడు ప్రేమగా మాట్లాడినా మంచి అని అనుకునే మాయలో ప్రేమ ఇది మా హక్కు అనే ఊబిలో పడుతున్న ఈనాటి యువతరం!! తప్పు ఎవరిదండి ఇక్కడ..? పెద్ద కొలువు అనే ఆశతో చిన్న చిన్న ప్రేమలకి దూరం చేస్తున్న తల్లిదండ్రులదా..? తల్లిదండ్రుల ప్రేమని కాకుండా వాళ్ళు పంపించే పైసల్నే చూస్తున్న మన యువతదా..? అయిదు సంవత్సరాలకి పాఠశాలకి పంపిస్తే ఏం అవుద్దండి, 2 సంవత్సరాలు చదువులో వెనకబడతాడా.. ఆ రెండు సంవత్సరాలు అమ్మ ప్రేమంటే ఏంటో నిజ జీవితంలో చదువుకుంటాడు. మమ్మీ అనే పదం బదులు అమ్మ అని పిలవడం నేర్చుకుంటాడు! వూళ్ళో వుండి చదువుకుంటే వెదవే ఎందుకౌతాడండి.. వ్యవసాయం గురించి తెలుసుకుంటాడు, రైతుల్ని గౌరవి

ఇదేనా దెయ్యమంటే..!!

Image
ఇదేనా దెయ్యమంటే..!!   మనకి తెలిసిన అమ్మాయో, అబ్బాయో కొంచెం తేడాగా ప్రవర్తిస్తే చాలు.. వీడికి గాలి సోకిందిరా అంటాం లేదంటే వీడికేదో దెయ్యం పట్టిందంటాం.. కాకపోతే ఈ మాటలు పల్లెటూళ్ళకే సొంతం.. ఎందుకు ఇలాంటి మాటలు పల్లెటూళ్ళలోనే వినపడుతున్నాయ్.. అక్కడ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తే భూత వైద్యుడు దగ్గరకి తీసుకెళ్ళే మన జనం, పట్టణాలలో ఇలాగే జరిగితే మానసిక వైద్యుల దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నారు?? అదే మన మూఢనమ్మకం.. వాటిలో మునిగితే భూతవైద్యులు కొంచెం పక్కన పెట్టి ఆలోచిస్తే మానసిక వైద్యులు. చిన్నప్పుడు అమ్మ మనం అన్నం తినకుండా మారాం చేసినా, లేదంటే బాగా అల్లరి చేస్తున్నా బయట బూచోడున్నాడు లేదంటే దెయ్యం ఉంది.. నువ్వు ఇలాగే అల్లరి చేస్తే అది వచ్చి నిన్ను తీసుకుపోతుంది అని భయపెడతారు... అదీ అక్కడ పడింది మన మనసులో దెయ్యం అనే బీజం.. ఇక అక్కడినుంచి రాత్రి పూట ఒంటరిగా ఇంట్లో వుండాలంటే భయం.. 12 తర్వాత ఒంటరిగా బయటకెళ్ళాలన్నా భయం.. అసలు నిజంగా దెయ్యాలున్నాయంటారా?? మన పెద్దలు చాలా తెలివైన వాళ్ళు.. ఎందుకంటే ఎక్కడికక్కడ కండిషన్స్ అప్లయ్ అంటారు కాబట్టి... వాటిలో కొన్ని, ఆ కొన్నింటి మీద నాకున్న ప్రశ్నలు.. 1. ఒక

వెర్రి అభిమానం..!!

Image
వెర్రి అభిమానం..!! ఒక హీరో ప్రొడ్యూసర్ని షూట్ చేస్తే, అతనికి ఏ శిక్షా ఉండదు.. ఎక్కడ సాక్ష్యం చెప్తారో అని వాచ్మెన్ ని బండతో చంపినా నో కేస్.. నో ఇన్వెస్టిగేషన్..!! అలాంటి వాళ్ళని మనం వోటు వేసి మరీ ఎన్నికల్లో గెలిపిస్తున్నాం... ఇక్కడ వాళ్ళకి శ్రీరామ రక్ష ఏంటంటే తప్పొప్పులు కూడా ఆలోచించకుండా మనం వెర్రెత్తిపోయే కులాభిమానం.. అందుకే ప్రభుత్వాలైనా పోలీసు లైనా వాళ్ళని టచ్ చేయాలంటే భయపడుతున్నారు.. కులాల వోట్లు ఎక్కడ పోతాయో అని తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తున్నారు!! అలాగే ఒక హీరో యాక్సిడెంట్ చేసి కార్ ని వదిలేసి పారిపోతే, అతనికీ ఏ శిక్షా ఉండదు.. ఎక్కడ గన్మెన్ సాక్ష్యం చెప్తారో అని అతని చావుకి కారణమైనా నో గిల్టీ.. సొంత కుటుంబ సభ్యులే గన్మెన్ ని ఇంటికి రానివ్వలేదంటే ఇంక ఏ లెవల్ లో ఆ కుటుంబాన్ని బెదిరించుంటారో ఆలోచించండి?? చివరికి ఆ హీరో నిర్దోషి.. పోనీ అలాంటి వాళ్ళకి శిక్షలు వేద్దామన్నా మనం వూరుకుంటామా... అయ్యో మన పిచ్చి అభిమానంతో దేశాన్ని అట్టుడికించమా?? అవసరమైతే ఒక వారం రోజులు తినకుండా ఐనా రోడ్డు మీదే కూర్చొని అభిమాన హీరోని విడిపించుకోమూ!! అభిమానం ఉండాల్సింది హీరోల మీదా.. కన్న

అమ్మ ఆత్మీయత..!!

Image
అమ్మ ఆత్మీయత..!! పొద్దున్నే నిద్రలేవగానే కాఫీకి అమ్మ, టూత్ పేస్ట్ కనపడకపోతే అమ్మ, స్నానానికి సోప్ అయిపోతే అమ్మ, టిఫిన్ వడ్డించడానికి అమ్మ, ఆ టిఫిన్ తినేటప్పుడు ఎక్కిళ్ళు వస్తే నీళ్ళకి అమ్మ, ఖర్చులకి నాన్నని డబ్బులు అడగడానికి అమ్మ, భోజనం చేసేటప్పుడు TV ఛానల్ మార్చడానికి అమ్మ, నీ బట్టలు ఉతకడానికి అమ్మ, సాయంత్రం ఆకలేస్తే అమ్మ, బయట తిరుగుతున్నప్పుడు చిన్న దెబ్బ తగిలితే అమ్మ, తగిలిన ఆ దెబ్బకి మందు రాయడానికీ అమ్మ, రాత్రి పూట చపాతీ కావాలంటే అమ్మ, పడుకున్నాక లైట్ ఆర్పడానికి కూడా అమ్మ, ఇలా పొద్దున్నుంచి పడుకునే వరకు ప్రతీదానికి అమ్మ.... అమ్మ.... అమ్మ....!! ఒక రోజులో అమ్మ మన కోసం చేసే పనులు ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు, ఇంటినుంచే వెళ్ళే ఉధ్యోగస్తులు అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే... ఒక్కసారి హాస్టల్లో ఉండి చూడండి, అమ్మ మనకోసం ఎంతలా ఇల్లంతా పరిగెట్టిందో, మన అవసరాలని తీర్చడానికి ఎన్ని ఆపసోపాలు పడిందో అర్ధం అవుతుంది. అటువంటి అమ్మకోసం, సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు వంట చేస్తే తప్పేంటి? ఇల్లు ఊడ్చి అంట్లు కడిగితే మాత్రం తప్పేంటి? హాస్టల్లో నువ్వే ఉతుక్కునే బట్టలు ఇంటిదగ్గర కూడా

మనిషికి మనిషే శత్రువు..!!

Image
మనిషికి మనిషే శత్రువు!! బాగా రద్దీగా ఉన్న ఒక పట్టణం, అందులో తోపుడు బండి మీద జామకాయలు అమ్ముకుంటున్న ఓ చిరు వ్యాపారి. అతని మనసులో ఎన్నో ఆలోచనలు.. ఈ రోజైనా ఒక 200 రూపాయలకి అమ్మితే బాగుండు, ఇంటికెళ్తూ తన చిట్టి తల్లి రెండు రోజులనుంచి అడుగుతున్న నోటు పుస్తకం కొనుక్కెళ్దామని.. అది ఇచ్చినప్పుడు తన కూతురు మొహంలో కలిగే ఆనందం కోసం ఇంకో 2 గంటలైనా అదే ఎండలో నిలబడడానికి సిద్దం. తను కష్టపడి పోగేసిన రూపాయి రూపాయి బ్యాంక్ లో దాచుకుంటే ఉపయోగం ఏంటని సంవత్సరానికో 1000 రూపాయలు వచ్చినా వచ్చినట్టే అనే ఆశతో వడ్డీకి ఇచ్చిన ఓ సగటు మధ్యతరగతి వ్యక్తి ఇంకో వైపు. కొడుకు కాలేజ్ ఫీజ్ కట్టడానికి ఆఖరి రోజు దగ్గర్లోనే ఉందని గుర్తెరిగి, ఈరోజైనా తను వడ్డీకిచ్చిన వాళ్ళు తిరిగి తన డబ్బులు ఇస్తారేమో అన్న ఆశతో కాళ్ళీడ్చుకుంటూ అటువైపుగా మొదలైన నడక. ఇంతలో ఒక ముగ్గురు బండి వైపు దూసుకొచ్చి, జామకాయల్ని తీసుకొని తింటూ.. డబ్బులిద్దాం అనే ఉద్దేశ్యం ఇసుమంతైనా కనపడని వాళ్ళమొహంలో, మత్తులో ముంగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ధోరణి కనిపించింది ఆ తోపుడు వ్యాపారికి.. దగ్గరికెళ్ళి, తీసుకున్న పళ్ళకి పైకం చెల్లించమని కొరుకున్నాడా చిర

హక్కూ - హాఫ్ బ్రాందీ!!

Image
హక్కూ - హాఫ్ బ్రాందీ!! ఏవే!! ఆ పసుపు రంగు పార్టీ వాళ్ళు డబ్బులివ్వడానికి వచ్చారా?? లేదక్కా ఈరోజొస్తారంటా.. సచ్చినోళ్ళు, ఎప్పుడైనా ఇవ్వాల్సిందేగా అదేదో త్వరగా ఇస్తే ఏం పోయింది.. ఆ టేబుల్ ఫ్యాన్ పార్టీ వాళ్ళు చూడు మొన్నే ఇచ్చి వెళ్ళారు.. ఇవే ఎన్నికల వేళల్లో మనకి తరచుగా వినిపించే మాటలు.. అవునక్కా!! మరి ఎవరికి ఓటు వేద్దామని అనుకుంటున్నావ్? ఏమోనే ముందు అందరినీ ఇవ్వనీ.. అందరిచ్చాక బాగా ఆలోచించి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తా.. ఇలా అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకొని ఓటు మాత్రం ఏ వొక్కడికో వేస్తాం..ఎవరో ఒక్కళ్ళకే ఓటు వేసేటప్పుడు అందరి దగ్గర డబ్బు తీసుకోవడమెందుకు చెప్పండి... మళ్ళీ అందులో ఖచ్చితంగా మీకే నా ఓటు అని దీపాలు కూడా ఆర్పడం...  ఇదే విషయం మన పెద్దవాళ్ళని అడిగితే ఈ ఎన్నికలు వచ్చెదే ఏ 5 సంవత్సరాలకో అప్పుడే కదా మనకో 6000 దక్కేది అంటారు... వాళ్ళు తీసుకుంటున్నారు అంటే కొంచెమైనా అర్ధం చేసుకోవచ్చు.. కానీ చదువుకున్న వాళ్ళు ఇలా డబ్బులకీ, క్రికెట్ కిట్ లకి లేదంటే బీర్ బిర్యానీ లకి అమ్ముడు పొతుంటేనే భారతమాత సిగ్గుతో తలవంచుకుంటుంది.. చదివినోడి కంటే చాకలోడు మేలన్నట్టుగా అన్నీ తెలిసిన న

'ఇప్పటి' వినాయకచవితి!

Image
'ఇప్పటి' వినాయకచవితి!    పాలు తాగే పిల్లల దగ్గరినుంచి పంచ కట్టిన పెద్దోళ్ళ వరకు, కన్నె పడుచుల దగ్గరినుంచి కాటికి కాళ్ళు చాపిన ముసలమ్మల వరకు, బిటెక్ చేసినవాళ్ళ దగ్గరినుంచి బియ్యం పండించే వాళ్ళ వరకు, పని కోసం ఎదురుచూస్తున్న యువత దగ్గరినుంచి ప్రభుత్వ ఉద్యోగస్తుల వరకు ఆది దేవుడనైనా కావొచ్చు, వింతైన ఆకారం వల్ల కావొచ్చు ఇలా అందరికీ వినాయకచవితి అంటే ప్రత్యేకమైన అభిమానమే!! నా చిన్నప్పుడు, వేకువ జామున పత్రికోసం పొలాల గట్ల మీద పరిగెట్టినా, రూపాయికి ఒక మట్టి బొమ్మ ముద్రేసి ఇచ్చినా, దాన్ని తామరాకులో పెట్టుకొని ఇంటికొస్తుంటే పొందిన ఆనందమైనా, కుంకుడు కాయలతో తలంటు పోసుకున్నా, కొత్త బట్టలు, చదవాల్సిన పుస్తకాలు పత్రితో పాటు గణపయ్య ముందుండినా, వినాయక చరిత్ర అందరికి అర్ధమయ్యేలా చదివినా, ఉండ్రాళ్ళు బొజ్జ గణపయ్యకి నైవేద్యంగా సమర్పించినా, బయటకెళ్ళి ఒక పదినిముషాలు తలుపులు మూసివేసినా, దేవుడొచ్చి మనమెట్టిన నైవేద్యం తింటాడని నమ్మినా, బజార్లో పెట్టిన పెద్ద మట్టి వినాయకుడితో మన బుజ్జి గణపయ్యని కలిపేసినా.. ఇవన్నీ ఆ రోజులకే చెల్లిపోయాయి!! ఇప్పుడంతా కమర్షియల్ గా వినాయకచవితిని జరుపుకునే కలికాలం రోజులు. క

మనకొచ్చిన స్వాతంత్ర్యం..!!

Image
మనకొచ్చిన స్వాతంత్ర్యం..!! స్వాతంత్ర్యం వచ్చింది, పరిపాలన ఏమైనా మారిందా..? స్వాతంత్ర్యం వచ్చింది, పాలించే వాళ్ళు ఏమైనా మారారా..? స్వాతంత్ర్యం వచ్చింది, భారతదేశ దోపిడీ ఏమైనా మారిందా..? స్వాతంత్ర్యం వచ్చింది, తప్పు చేసినోళ్ళని శిక్షించగలుగుతున్నామా..? స్వాతంత్ర్యం వచ్చింది, అవినీతిపరులని నిలదీయగలుగుతున్నామా..? స్వాతంత్ర్యం వచ్చింది, అమ్మాయిలు అర్ధరాత్రుళ్ళు బయటకి వెళ్ళగలుగుతున్నారా..? స్వాతంత్ర్యం వచ్చింది, మర్డర్లు,మానభంగాలు ఆగిపోయాయా..? స్వాతంత్ర్యం వచ్చింది, పేదోడి పొట్ట కనీసం నిండుతుందా..? స్వాతంత్ర్యం వచ్చింది, రైతులు రారాజులు కాగలిగారా..? స్వాతంత్ర్యం వచ్చింది, ప్రజలు నిరసనల పేరిట రోడ్డెక్కడం మానేశారా..? స్వాతంత్ర్యం వచ్చింది, రూపాయి విలువేమైనా పెరిగిందా..? స్వాతంత్ర్యం వచ్చింది, తెల్లవాడికి సలాం అనడం ఏమైనా ఆపేశామా..? స్వాతంత్ర్యం వచ్చింది, భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఆపేశామా..? స్వాతంత్ర్యం వచ్చింది, అది తెచ్చిన వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకున్నామా..? స్వాతంత్ర్యం వచ్చింది, స్వేచ్ఛా గాలి పీల్వగలుగుతున్నామా..? స్వాతంత్ర్యం వచ్

ఆ రోజులు..!!

Image
ఆ రోజులు..!! ఒంటిపూట బడుల కోసం ఒంటి కాలుపై ఎదురు చూసిన ఆ రోజులు, ఎండాకాలం సెలవుల్లో నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన ఆ రోజులు, రూపాయికి రెండు పుల్ల ఐసులు కొనుక్కున్న ఆ రోజులు, చిరిగిన నిక్కర్లతో బడికి వెళ్ళిన ఆ రోజులు, బియ్యం సంచితో స్కూల్ బ్యాగ్ ని కుట్టించుకున్న ఆ రోజులు, పక్కన ఉన్న అమ్మాయిని స్నేహితురాలిగా మాత్రమే చూసిన ఆ రోజులు, కరెంట్ లేకపోయినా చెమటలు కారేలా క్రికెట్ ఆడిన ఆ రోజులు, ప్రైవేట్ లో కరెంట్ పోగానే కొవ్వొత్తి ముందు గుమిగూడి ముచ్చట్లాడిన ఆ రోజులు, కరుగుతున్న కొవ్వొత్తిని గిన్నె కొవ్వొత్తిలా మార్చేసిన ఆ రోజులు, చీకటైతే చల్లని గాలికోసం ఆరుబయట మంచాలేసిన ఆ రోజులు, అమ్మ పక్కన పడుకున్నట్టు నటిస్తూ కొంగుకున్న చిల్లర నొక్కేసిన ఆ రోజులు.. ఆ రోజులకీ ఈ రోజులకీ పోలికా? అవి గోమాత నుంచి వచ్చే పవిత్రమైన గోమూత్రమైతే, ఇవి మనమే కల్తీ చేసిన జెర్సీ ఆవుల నుంచి వస్తున్న పాలదారవంటివి.. సెల్ ఫోన్లు లేకపోయినా ఉత్తరాలతో ఊరిలో ఉన్న చుట్టాలని చుట్టేసిన రోజులవైతే, బంధువులకి దూరంగా ఉన్నామో భార్యాబిడ్డలకి దగ్గరగా ఉన్నామో అర్ధం కాని రోజులివి!! అనుబంధాలకోసం, ఆప్యాయతలకోసం ఆస్తులని సైతం వదులుకున్న రోజులవైతే, అవ

ఎవరిదీ తప్పు..?

Image
ఎవరిదీ తప్పు..? న్యూస్ పేపర్స్ లోనో చానల్స్ లోనో పైన ఉన్న చిత్రాన్ని మీరు చూసే ఉంటారు.. అది తల్లిదండ్రులు అంత్యంత కర్కశంగా తమ సొంత బిడ్డనే కడతేర్చిన వైనం... వేరే కులం అబ్బాయిని, పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్న ఒక నారీమణికి భారతదేశంలో పట్టిన గతి... ప్రేమ విషయం చెప్పగానే ఇంట్లో వాళ్ళు వద్దంటారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా... 20 సంవత్సరాలు మన అమ్మాయిగా పెరిగిన పిల్ల ఒకతన్ని ప్రేమించాను అంటే ఆరా తీయడం మానేసి ఆవేశంతో ఊగిపోయే పరిస్థితి.. మన పెద్దవాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా?? వాళ్ళ భయం వాళ్ళది... ఉన్న ఒక్కగానొక్క నలుసు ప్రేమ అనే మాయలో పడి తన బంగారు జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటుందో అని... అంతే కానీ ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డలకి మంచి జీవితం దొరుకుంతుంది అంతే దాన్ని కాలరాయాలని చూడరు.. పారిపోయి పెళ్ళి చేసుకోవడం!!! ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి.. వాళ్ళని ఎలాగైనా ఒప్పించడానికి ప్రయత్నిచాలి కానీ వాళ్ళని వదిలేసి నీ దారి నువ్వు చూసుకోవడం ఏంటి? చిన్నప్పటినుంచీ నువ్వు ఏం అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రేమించిన అబ్బాయిని కాదంటున్నారు అంటే

ఎక్కడ రైతు..?

Image
ఎక్కడ రైతు..? 1960-70 ల్లో మన పెద్దవాళ్ళు ఉద్యోగం వచ్చినా వెళ్ళేవాళ్ళు కాదు.. ఎందుకంటే అప్పుడు వ్యవసాయానికి ఉన్న గౌరవం అలాంటిది.. ఎవరికిందా పని చేయాల్సిన అవసరం లేదు.. ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పనే లేదు.. ఉన్న భూమినే సాగు చేసుకుంటూ, గర్వంగా తలెత్తుకొని వ్యవసాయం చేసేవాళ్ళు.. అలా తలెత్తుకొని తిరిగిన ఆ రైతులే  ఇప్పుడు పొట్ట చేతపట్టుకొని భార్యాబిడ్డలతో పట్టణానికి తలదించుకు పోవాల్సిన పరిస్థితి... పట్టణాలలో పరిశ్రమలకి పగలు పూటే కరెంట్ ఇచ్చే మన ప్రభుత్వం , పల్లెల్లో నివశిస్తున్న రైతుల పొలాలకి రాత్రుళ్ళే ఎందుకు కరెంట్ ఇస్తుంది...?? ఎందుకంటే.. ఇక్కడ ప్రభుత్వానికి డబ్బులు కడతారు.. అక్కడ రైతులు కట్టరు కాబట్టి.. కట్టరు కాదు కట్టలేని పరిస్థితి వాళ్ళది... ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో జరిగే బిజినెస్, అక్కడ చిన్న చిన్న రైతుల నోరు మూసే ప్రాసెస్.. పరిశ్రమలు రావడం మంచిదే.. మన పిల్లలకి మంచి కొలువులు వస్తాయి. వాళ్ళు ఏ కష్టాలూ పడకుండా హాయిగా జీవిస్తారు... అసలు రైతు అంటే కష్టాల పుట్ట అనే పేరు తెచ్చింది ఎవరు?? మనం కాదా?? నాణ్యమైన విత్తానాలు రైతులకి దొరకనివ్వం.. 10 విత్తనాలు నాటితే రెం

ఉమెన్స్ కి ఉద్యోగాలా..?

Image
ఉమెన్స్ కి ఉద్యోగాలా..? నీకెందుకే ఉద్యోగం?? చక్కగా ఇంట్లో కూర్చొని "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సీరియల్ చూసుకుంటూ.. ఆ సీరియల్లో హీరోయిన్స్ లా ఇంట్లో పని వంటింట్లో వంట చేసుకుంటూ హ్యప్పీగా బ్రతికెయ్యకా?? అయినా మీరు ఉద్యోగాలు చేసి ఏం ఒలకబెట్టాలి?  ఆ తిప్పలేవో వచ్చే వాడే పడతాడులే కానీ నీకెందుకు చక్కగా పెళ్ళి చేసుకొని ఇంటి పట్టున ఉండక?? ఇవి మన ఇళ్ళళ్ళో, చెల్లెలో లేక కూతురో ఉద్యోగం చేస్తా అనగానే మన నోటి నుంచి రాలే శుభాషితాలు (శుభం కాని అషితాలు).. స్వతంత్రంగా బ్రతకాలి, సొంత కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పే అమ్మాయిల గురించి నేనిక్కడ చర్చించదలుచుకోలేదు కానీ, మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయై పుట్టి, వీధి బడిలో 10వ తరగతి వరకు చదువుకొని, అదే వీధిలో ఉన్న కాలేజి లో డిగ్రీ కూడా పూర్తి చేసి, బయటకి వస్తే.. నువ్వు ఏం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చో అనే వినాలనిపించని మాట తల్లిదండ్రుల నోటి నుంచి... మన కుటుంబం ఆర్ధికంగా స్థిరపడినదైతే, అమ్మాయిలకి ఈ ఉద్యోగం చేయాలన్న ఆలోచనే రాదు.. కానీ తల్లిదండ్రుల కాయ కష్టాలు చూడలేక, తోడబుట్టిన వాడు తనకంటే చిన్న వాడు అయితేనే.. ఎలాగైనా ఉద్యోగం చే

ప్రశ్నిచడంలోనే తేడా..!!

Image
ప్రశ్నిచడంలోనే తేడా..!! గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా ఒకటే చర్చలు.. అర్ధం పర్ధం లేని మాటలు.. ఉపయోగం లేని ఉపన్యాసాలు.. దేని గురించనుకుంటున్నారా.. అదే ఆడవాళ్ళ మీద సీనియర్ నటుడు ఘోరమైన కామెంట్స్ అని!! చలపతి రావు గారు మాట్లాడింది తప్పు అని ప్రతి ఒక్కరూ గొంతులు చించుకుంటున్నారు.. మరి తెలుగు లోనే పెద్ద హీరో ఇలాంటి మాటలే అమ్మాయిలని అన్నప్పుడు నిద్రపోయారా..?? లేక నిద్ర నటించారా...?? అమ్మో అలా అనింది ఒక పెద్ద అతను వాడితో మనమెందుకు పెట్టుకోవడం అని తప్పించుకున్నారా..?? ఇదే విధంగా, ఒక హిందీ హీరోయిన్ అబ్బాయిలు దానికి తప్ప ఎందుకూ పనికిరారు అని కామెంట్ చేసినప్పుడు ఎవ్వరూ స్పందించలేదే..?? అంటే అనింది అబ్బాయిలనే అనా? ఎందుకీ తేడా?? ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, మిగతా ఇద్దరు కనీసం క్షమాపణలు కూడా అడగలేదు.. పాపం చలపతిరావు గారు వెర్రోడు కాబట్టే క్షమాపణలు కోరుకున్నారు.. ఇంతటితో వదిలేయొచ్చుగా... ఆహా!! దేశంలో ఇదొక్కటే అతి పెద్ద సమస్య అన్నట్టు దాన్నే పట్టుకొని ఊగిపోవడం.. ఇక్కడ నువ్వు మొదటి సారి తప్పు జరిగినప్పుడే స్థాయిని బట్టి కాకుండా సమస్యని బట్టి నిలదీసుంటే, ఇలా ఇంకొకరు మట్లాడేవాళ్ళు కాదు..

నాన్న విలువ...

Image
నాన్న విలువ... కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, బయటకి వచ్చాక నాన్న ఆయన చచ్చే వరకూ మనల్ని అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు... అదీ నాన్న ప్రేమ.. మాటల్లో చెప్పలేనిదీ, చేతల్లో చూపించలేనిదీ.. ఏ కవీ రాయనిదీ... మన పెద్దవాళ్ళు, అమ్మ కడుపు చూస్తుంది అంటారు కానీ నావరకు అమ్మ కడుపు చూస్తే నాన్న పిల్లలకి అవసరమయ్యే డబ్బుల్ని చూస్తాడు... తన పిల్లలు సమాజంలో ఎవరి ముందూ తక్కువగా ఉండకూడదు అనే ఒకే ఒక్క పాయింట్ కోసం కష్టపడుతూనే ఉంటాడు, పడుతూనే చస్తాడు... నువ్వు ఓడిపోయినప్పుడు నీ వెంటే వుండి ప్రోత్సహించడానికీ, గెలిచినప్పుడు నా కొడుకు/కూతురు అని గర్వంగా ఊరంతా చెప్పుకోవడానికి వెర్రెత్తిపోయే పిచ్చోడే  "నాన్న"... అటువంటి మారాజులకి మనం ఇస్తున్న గౌరవం, తక్కువ చేసి మాట్లాడడం, తన్నడం.. అనాధాశ్రమంలో చేర్పించడం... నాన్నకి తెలిసిందొక్కటే, ఊరంతా ఒకవైపు వుండి నువ్వు ఒక్కడివే ఇంకో వైపు వుంటే వేరే ఆలోచనే లేకుండా నీవెంటే నిలబడడం... తినవలసిన మనుషులు నలుగురు వుండి, భోజనం ఇద్దరికే వుంటే.. ఎందుకో నాకు ఈరోజు ఆకలిగా లేదు అని అమ్మ అంటే.. మద్యాన్నం తిన్నదే ఇంకా అరగలేదు అని అబద్ధం చెప్

అమ్మకో ఫోన్ కాల్...

Image
అమ్మకో ఫోన్ కాల్... ప్రొద్దున్నే 8 కి నిద్ర లేచి 9 కల్ల తయారై భార్య ఏం టిఫిన్ చేసిందో కూడా గమనిచకుండా కొంచెం తినేసి బస్ స్టాప్ కి ఉరుకులు.. ఇది పట్టణాలలో మన ఉరుకులు పరుగుల జీవితం.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇవే పరుగులు... ఈ మధ్యలో ఊరి నుంచి మన అమ్మగారో లేదంటే నాన్నగారో ఫోన్ చేస్తే మేనేజర్ పక్కనే ఉన్నాడు లేదంటే మీటింగ్ లో ఉన్నాను తర్వాత కాల్ చేస్తా అని అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినకుండా ఫోన్ పెట్టేయడమే.. పోనీ నీ బిజీ తగ్గాక ఫోన్ చేస్తున్నావా అంటే అదీ ఉండదు... తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తేనే మనకి ఆ విషయం గుర్తొచ్చేది... పట్టణాలలో కుటుంబాన్ని నెగ్గుకురావాలంటే ఇవి తప్పవు నేనూ ఒప్పుకుంటా కానీ, కన్నోళ్ళకి కనీసం 9 నిమిషాలు కేటాయించలేని ఈ జీవితం ఎందుకండి?? జీతం ఇచ్చేవాడికోసం రోజుకి 9 గంటలు ఇస్తున్నాం.. మరి 9 నెలలు మోసి కని పెంచిన నీ తల్లి కోసం 9 నిమిషాలు ఇవ్వలేవా?? ఏ... నీకు నచ్చిన సినిమా రిలీజ్ అయితే ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ హాల్ కి వెళ్తావే.. మరి నువ్వే నచ్చిన నీ తల్లికి కి ఒక్క 9 నిమిషాలు ఆఫీస్ అయిపోయాక ఇవ్వలేవా?? నీకంటే పట్టణంలో స్నేహితులు, షికార్లు, సినిమాలు ఇల

చిరిగిన నోటు...

Image
చిరిగిన నోటు... పట్టణాలలో ఉధ్యోగరీత్యా మనం చాలా ప్రాంతాలకి వెళ్ళాల్సి ఉంటుంది... ఇల్లు ఒక చోట ఉంటే ఉధ్యోగం చేయాల్సిన చోటు ఇంకెక్కడో ఉంటుంది...కానీ తప్పదు మన కోసం మనల్నే నమ్ముకున్న కుటుంబం కోసం పరిగెట్టాల్సిందే... ఇలానే సాగే మన రోజుల్లో ఏదో ఒకరోజు మనం బస్సు కండక్టర్నో లేక ఆటో వాడినో 500 కి చిల్లర అడుగుతాం.. వాడు ఇస్తాడు... ఆ చిల్లర లో ఒక 100 నోటు చిరిగిపొయింది వచ్చిందనుకోండి... ఇక వాడిని ఏసుకుంటాం చూడండి మాములుగా కాదు... చిరిగిన నోటు చూడగానే : 1. వారినీ ఈ ఆటో/కండక్టర్ గాడు దెబ్బేసేసాడు రా.. 2. అసలు ఈ ఆటోగాళ్ళే అంత... ఎప్పుడు మోసం చేద్దామా అని ఎదురు చూస్తుంటారు... 3. నా 100 దొబ్బినోళ్ళు వాళ్ళేం బాగుపడతారు.. వాడు, వాడి కుటుంబం రోడ్డున పడాల్సిందే.... 4. అసలు ఈ ఇండియానే ఇంత.. దరిద్రపు దేశం.... కాసేపు ఆగాక : 1. ఇప్పుడు ఈ చిరిగిన నోటుని ఎవడికి అంటగట్టాలి? 2. లేదంటే మనకి 100 లాసు. ఇప్పుడు మనకి కూల్ డ్రింక్ తాగాలని అస్సలు లేకపోయిన ఏదో ఒక షాప్ కి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని ఆ చిరిగిన 100 ఇస్తాం బాగున్న వైపు పైకి చుపిస్తూ... కనిపెడతాడా లేదా అని చిన్న సందేహం మనసులో... షాప

అమ్మ కొడుకు...

Image
అమ్మ కొడుకు... ఒకప్పుడు అందరూ చక్కగా పల్లెటూళ్ళోనే ఉంటూ, హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం కొనసాగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉద్యోగాల పేరిట లేదంటె మెరుగైన వసతుల పేరిట పట్టణాలకు బయలుదేరుతున్నారు.. పల్లెలను/పల్లెటూర్లను అనాధలను చేస్తున్నారు. మీరు పట్టణాల్లోనే వుంటే ఈ "అమ్మ కొడుకు" అనే పదాన్ని వినే అవకాశమే లేదు... కానీ మీ వంశ వృక్షం పల్లెటూర్లలోనే వున్నట్లైతే ఇది మీరు వినే అవకాశం వుంది.. సాధారణంగా మనం పండగలకో లేదంటే ఏదైనా పని పడినప్పుడో మన సొంతవూర్లకి వెళ్తుంటాం... అప్పుడు ఎదురు వచ్చిన ప్రతి ఒక్కరు మనల్ని పలుకరించడం ఆనవాయితి...  ఇప్పుడేనా రావడం అనేది మొదటి ప్రశ్న ఐతే ఏం చేస్తున్నావ్ అనేది రెండో ప్రశ్న. ☺☺ అవి మన పల్లెటూరి అనుబంధాలు... మీకు ఎదురు వచ్చిన వాళ్లకి మీరు తెలిస్తే ఏం ప్రోబ్లెం లేదు.. కానీ తెలియకపొతే మొదటి ప్రశ్న ఎవరి అబ్బాయివి/అమ్మాయివి అని?? అందుకు సమాధానంగా మనం ఫలానా రామకోటేశ్వర రావు గారి అబ్బాయిని అనో శ్రీనివాసర రావు గారి అమ్మాయిని అనో చెప్తాం.. ఇక్కడే నాకు ఒక ప్రశ్న తలెత్తింది..... ఎందుకు మనం మన అమ్మ గారి పేరు చెప్పడం లేదు లేదంటే మనం చెప్పినా వాళ్