ప్రశ్నిచడంలోనే తేడా..!!

ప్రశ్నిచడంలోనే తేడా..!!



గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా ఒకటే చర్చలు.. అర్ధం పర్ధం లేని మాటలు..
ఉపయోగం లేని ఉపన్యాసాలు.. దేని గురించనుకుంటున్నారా.. అదే ఆడవాళ్ళ మీద సీనియర్ నటుడు ఘోరమైన కామెంట్స్ అని!!

చలపతి రావు గారు మాట్లాడింది తప్పు అని ప్రతి ఒక్కరూ గొంతులు చించుకుంటున్నారు.. మరి తెలుగు లోనే పెద్ద హీరో ఇలాంటి మాటలే అమ్మాయిలని అన్నప్పుడు నిద్రపోయారా..?? లేక నిద్ర నటించారా...??
అమ్మో అలా అనింది ఒక పెద్ద అతను వాడితో మనమెందుకు పెట్టుకోవడం అని తప్పించుకున్నారా..??
ఇదే విధంగా, ఒక హిందీ హీరోయిన్ అబ్బాయిలు దానికి తప్ప ఎందుకూ పనికిరారు అని కామెంట్ చేసినప్పుడు ఎవ్వరూ స్పందించలేదే..?? అంటే అనింది అబ్బాయిలనే అనా? ఎందుకీ తేడా??

ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, మిగతా ఇద్దరు కనీసం క్షమాపణలు కూడా అడగలేదు.. పాపం చలపతిరావు గారు వెర్రోడు కాబట్టే క్షమాపణలు కోరుకున్నారు..
ఇంతటితో వదిలేయొచ్చుగా... ఆహా!! దేశంలో ఇదొక్కటే అతి పెద్ద సమస్య అన్నట్టు దాన్నే పట్టుకొని ఊగిపోవడం..

ఇక్కడ నువ్వు మొదటి సారి తప్పు జరిగినప్పుడే స్థాయిని బట్టి కాకుండా సమస్యని బట్టి నిలదీసుంటే, ఇలా ఇంకొకరు మట్లాడేవాళ్ళు కాదు..
అప్పుడు మూసుకొని కూర్చున్న నువ్వే.. ఇప్పుడెందుకు చించుకుంటున్నావ్...?? తప్పుని మొదటిసారి ప్రోత్సహించిందే నువ్వు..
ఇప్పుడు కూడా ఎవరో ఒక పెద్ద స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడి ఉంటే నీకు అస్సలు ఏమీ అనిపించేది కాదు.. పైగా సపోర్ట్ కూడా చేసేవాడివి..

ఒక ప్రజాప్రతినిధి 100 కోట్లు నొక్కినా చీమైనా కుట్టినట్లు అనిపించని మనకి, పక్కనోడు ఒక్క రూపాయి మోసం చేసాడని తెలియగానే ఆవేశం కట్టలు తెంచుకుంటుంది...?
ఇలాగే, సమాజంలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న వాళ్ళు ఏం మాట్లాడినా కరక్టే అనిపించే మనకు,
చిన్న స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడినా తప్పుల తడకే అనిపిస్తుంది.. ఇక ఎక్కడలేని దేశభక్తిని నీలో పులుముకొని వాడి మీద విరుచుకుపడతావ్.. ఎందుకు??

బలవంతుడి మీద బలహీనంగా పని చేసే మన చట్టాలు, బలహీనుల మీద చాలా బలంగా పని చేస్తాయ్ అని చెప్పడానికి ఇంకో ఉదాహరణే ఈ సంఘటన..
చట్టాలే కాదు సమాజం కూడా అలాగే తయారవుతుంది.. అయ్యింది!!
చివరిగా, స్త్రీమూర్తుల గురించి ఇలా మాట్లడడం ఖచ్చితంగా తప్పే, కానీ దాన్ని ప్రత్యర్ధుల హోదాని బట్టి కాకుండా మనలో ఎంత మంది ప్రశ్నించగలుగుతున్నారు అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే!!

                                                                                                                           లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...