అమ్మకో ఫోన్ కాల్...

అమ్మకో ఫోన్ కాల్...


ప్రొద్దున్నే 8 కి నిద్ర లేచి 9 కల్ల తయారై భార్య ఏం టిఫిన్ చేసిందో కూడా గమనిచకుండా కొంచెం తినేసి బస్ స్టాప్ కి ఉరుకులు.. ఇది పట్టణాలలో మన ఉరుకులు పరుగుల జీవితం..

సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇవే పరుగులు... ఈ మధ్యలో ఊరి నుంచి మన అమ్మగారో లేదంటే నాన్నగారో ఫోన్ చేస్తే మేనేజర్ పక్కనే ఉన్నాడు లేదంటే మీటింగ్ లో ఉన్నాను తర్వాత కాల్ చేస్తా అని అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినకుండా ఫోన్ పెట్టేయడమే..
పోనీ నీ బిజీ తగ్గాక ఫోన్ చేస్తున్నావా అంటే అదీ ఉండదు... తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తేనే మనకి ఆ విషయం గుర్తొచ్చేది...

పట్టణాలలో కుటుంబాన్ని నెగ్గుకురావాలంటే ఇవి తప్పవు నేనూ ఒప్పుకుంటా కానీ, కన్నోళ్ళకి కనీసం 9 నిమిషాలు కేటాయించలేని ఈ జీవితం ఎందుకండి??
జీతం ఇచ్చేవాడికోసం రోజుకి 9 గంటలు ఇస్తున్నాం.. మరి 9 నెలలు మోసి కని పెంచిన నీ తల్లి కోసం 9 నిమిషాలు ఇవ్వలేవా??
ఏ... నీకు నచ్చిన సినిమా రిలీజ్ అయితే ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ హాల్ కి వెళ్తావే.. మరి నువ్వే నచ్చిన నీ తల్లికి కి ఒక్క 9 నిమిషాలు ఆఫీస్ అయిపోయాక ఇవ్వలేవా??

నీకంటే పట్టణంలో స్నేహితులు, షికార్లు, సినిమాలు ఇలా చాలా ఉన్నాయ్ కాలక్షేపం చేయడానికి, మరి ఊరిలో ఉన్న మీ అమ్మ గారికి నువ్వు తప్ప ఎవరున్నారయ్యా??
నీతో మాట్లాడే ఆ 9 నిమిషాల కోసం ఆ తల్లి 9 రోజులు ఎదురు చూడాలా?? ఇదెక్కడి న్యాయం??

చివరిగా ఒక్క మాట, 24 గంటల్లో 9 నిమిషాలు నాకు తీరిక దొరకడం లేదు అని చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోకు, నిన్నే పిచ్చిగా ప్రేమించే నీ తల్లినీ మోసం చేయకు.. (ఆలోచించమని మనవి!!)

                                                                                                                లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...