అమ్మ కొడుకు...

అమ్మ కొడుకు...


ఒకప్పుడు అందరూ చక్కగా పల్లెటూళ్ళోనే ఉంటూ, హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం కొనసాగించేవాళ్ళు.
కానీ ఇప్పుడు ఉద్యోగాల పేరిట లేదంటె మెరుగైన వసతుల పేరిట పట్టణాలకు బయలుదేరుతున్నారు.. పల్లెలను/పల్లెటూర్లను అనాధలను చేస్తున్నారు. మీరు పట్టణాల్లోనే వుంటే ఈ "అమ్మ కొడుకు" అనే పదాన్ని వినే అవకాశమే లేదు... కానీ మీ వంశ వృక్షం పల్లెటూర్లలోనే వున్నట్లైతే ఇది మీరు వినే అవకాశం వుంది..

సాధారణంగా మనం పండగలకో లేదంటే ఏదైనా పని పడినప్పుడో మన సొంతవూర్లకి వెళ్తుంటాం... అప్పుడు ఎదురు వచ్చిన ప్రతి ఒక్కరు మనల్ని పలుకరించడం ఆనవాయితి...  ఇప్పుడేనా రావడం అనేది మొదటి ప్రశ్న ఐతే ఏం చేస్తున్నావ్ అనేది రెండో ప్రశ్న. ☺☺ అవి మన పల్లెటూరి అనుబంధాలు... మీకు ఎదురు వచ్చిన వాళ్లకి మీరు తెలిస్తే ఏం ప్రోబ్లెం లేదు.. కానీ తెలియకపొతే మొదటి ప్రశ్న ఎవరి అబ్బాయివి/అమ్మాయివి అని??
అందుకు సమాధానంగా మనం ఫలానా రామకోటేశ్వర రావు గారి అబ్బాయిని అనో శ్రీనివాసర రావు గారి అమ్మాయిని అనో చెప్తాం..
ఇక్కడే నాకు ఒక ప్రశ్న తలెత్తింది..... ఎందుకు మనం మన అమ్మ గారి పేరు చెప్పడం లేదు లేదంటే మనం చెప్పినా వాళ్లు ఎందుకు అంత త్వరగా గుర్తు పట్టలేక పోతున్నారు... ఎందుకంటే నాన్న గారు మన కుటుంబం కోసం బయట తిరిగి డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి ఎక్కువమందికి తెలిసే అవకాశం వుంది.. కానీ అమ్మ గారు ఇంట్లోనే వుండి మన అవసరాలని చూసుకుంటుంది కాబట్టి ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేదు...
కానీ నా విషయానికి వస్తే నాకు 21 సం|| వున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అప్పటినుంచి మా అమ్మగారే నన్ను అన్నయ్యని కష్టపడి పెంచారు... నాకు ఉద్యోగం వచ్చేంతవరకు వచ్చాక కూడ ఆమె కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటున్నారు..... ఇప్పుడు ఆమెకి నిజమైన సంతొషం ఎప్పుడు అంటే ఇద్దరు కొడుకులు బాగా స్థిరపడి పెళ్లిళ్లు చేసుకోని సంతోషంగ వున్నప్పుడే.. అప్పటివరకు నేను చెప్పినా ఎవరు చెప్పినా అవిడ పని చేయడం ఆపరు విశ్రాంతి తీసుకోవడుం చేయరు.....
ఇన్ని చేసిన అమ్మకు నేను ఏమి ఇవ్వగలను.. ఒక్క ప్రేమ ని తప్ప..
అందుకే ఇక నుంచి "ఎవరి అబ్బాయివి నువ్వు అని " నన్ను ఎవరు అడిగిన  నా సమాధానం ఒక్కటే "రమాధేవి గారి కొడుకుని" అని...
వాళ్ళు గుర్తు పట్టకపోయిన నాకు సంతోషమే కానీ అమ్మ కొడుకుని అని చెప్పుకోవడంలో ఉన్న ఆనందం నాకు ఉంటుంది..

నాన్న గారిని ఆయన చేసిన త్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ అమ్మ మనకోసం చేస్తున్న పనులని కుడా గుర్తించడమే నా  ఉద్దేశ్యం.
        
                                                                                                                                                                                                                                              లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Post a Comment

Popular posts from this blog

అబ్బాయికి 'అప్పగింతలు' !!

మన ఊరి 'సంక్రాంతి'!!