నాన్న విలువ...

నాన్న విలువ...

కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, బయటకి వచ్చాక నాన్న ఆయన చచ్చే వరకూ మనల్ని అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు...
అదీ నాన్న ప్రేమ.. మాటల్లో చెప్పలేనిదీ, చేతల్లో చూపించలేనిదీ.. ఏ కవీ రాయనిదీ...

మన పెద్దవాళ్ళు, అమ్మ కడుపు చూస్తుంది అంటారు కానీ నావరకు అమ్మ కడుపు చూస్తే నాన్న పిల్లలకి అవసరమయ్యే డబ్బుల్ని చూస్తాడు...
తన పిల్లలు సమాజంలో ఎవరి ముందూ తక్కువగా ఉండకూడదు అనే ఒకే ఒక్క పాయింట్ కోసం కష్టపడుతూనే ఉంటాడు, పడుతూనే చస్తాడు...

నువ్వు ఓడిపోయినప్పుడు నీ వెంటే వుండి ప్రోత్సహించడానికీ, గెలిచినప్పుడు నా కొడుకు/కూతురు అని గర్వంగా ఊరంతా చెప్పుకోవడానికి వెర్రెత్తిపోయే పిచ్చోడే  "నాన్న"...
అటువంటి మారాజులకి మనం ఇస్తున్న గౌరవం, తక్కువ చేసి మాట్లాడడం, తన్నడం.. అనాధాశ్రమంలో చేర్పించడం...

నాన్నకి తెలిసిందొక్కటే, ఊరంతా ఒకవైపు వుండి నువ్వు ఒక్కడివే ఇంకో వైపు వుంటే వేరే ఆలోచనే లేకుండా నీవెంటే నిలబడడం...
తినవలసిన మనుషులు నలుగురు వుండి, భోజనం ఇద్దరికే వుంటే.. ఎందుకో నాకు ఈరోజు ఆకలిగా లేదు అని అమ్మ అంటే.. మద్యాన్నం తిన్నదే ఇంకా అరగలేదు అని అబద్ధం చెప్పేవాడే "నాన్న"...
అమ్మ లేకపొతే ఎవరినైనా అమ్మా అని పిలవచ్చు...వాళ్ళు ఏమీ అనుకోరు.. కానీ నాన్నే లేకపోతే ఆయన్ని, నాన్న అన్న పిలుపుని మర్చిపోవాల్సిందే...

చివరిగా, విలువైన వస్తువులున్న జీవితాన్ని ఇవ్వకున్నా, విలువలున్న ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ "నాన్న"...

                                                                                                                   లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Post a Comment

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

అమ్మ కొడుకు...