Posts

Showing posts from May, 2017

ఉమెన్స్ కి ఉద్యోగాలా..?

Image
ఉమెన్స్ కి ఉద్యోగాలా..? నీకెందుకే ఉద్యోగం?? చక్కగా ఇంట్లో కూర్చొని "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సీరియల్ చూసుకుంటూ.. ఆ సీరియల్లో హీరోయిన్స్ లా ఇంట్లో పని వంటింట్లో వంట చేసుకుంటూ హ్యప్పీగా బ్రతికెయ్యకా?? అయినా మీరు ఉద్యోగాలు చేసి ఏం ఒలకబెట్టాలి?  ఆ తిప్పలేవో వచ్చే వాడే పడతాడులే కానీ నీకెందుకు చక్కగా పెళ్ళి చేసుకొని ఇంటి పట్టున ఉండక?? ఇవి మన ఇళ్ళళ్ళో, చెల్లెలో లేక కూతురో ఉద్యోగం చేస్తా అనగానే మన నోటి నుంచి రాలే శుభాషితాలు (శుభం కాని అషితాలు).. స్వతంత్రంగా బ్రతకాలి, సొంత కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పే అమ్మాయిల గురించి నేనిక్కడ చర్చించదలుచుకోలేదు కానీ, మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయై పుట్టి, వీధి బడిలో 10వ తరగతి వరకు చదువుకొని, అదే వీధిలో ఉన్న కాలేజి లో డిగ్రీ కూడా పూర్తి చేసి, బయటకి వస్తే.. నువ్వు ఏం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చో అనే వినాలనిపించని మాట తల్లిదండ్రుల నోటి నుంచి... మన కుటుంబం ఆర్ధికంగా స్థిరపడినదైతే, అమ్మాయిలకి ఈ ఉద్యోగం చేయాలన్న ఆలోచనే రాదు.. కానీ తల్లిదండ్రుల కాయ కష్టాలు చూడలేక, తోడబుట్టిన వాడు తనకంటే చిన్న వాడు అయితేనే.. ఎలాగైనా ఉద్యోగం చే

ప్రశ్నిచడంలోనే తేడా..!!

Image
ప్రశ్నిచడంలోనే తేడా..!! గత కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా ఒకటే చర్చలు.. అర్ధం పర్ధం లేని మాటలు.. ఉపయోగం లేని ఉపన్యాసాలు.. దేని గురించనుకుంటున్నారా.. అదే ఆడవాళ్ళ మీద సీనియర్ నటుడు ఘోరమైన కామెంట్స్ అని!! చలపతి రావు గారు మాట్లాడింది తప్పు అని ప్రతి ఒక్కరూ గొంతులు చించుకుంటున్నారు.. మరి తెలుగు లోనే పెద్ద హీరో ఇలాంటి మాటలే అమ్మాయిలని అన్నప్పుడు నిద్రపోయారా..?? లేక నిద్ర నటించారా...?? అమ్మో అలా అనింది ఒక పెద్ద అతను వాడితో మనమెందుకు పెట్టుకోవడం అని తప్పించుకున్నారా..?? ఇదే విధంగా, ఒక హిందీ హీరోయిన్ అబ్బాయిలు దానికి తప్ప ఎందుకూ పనికిరారు అని కామెంట్ చేసినప్పుడు ఎవ్వరూ స్పందించలేదే..?? అంటే అనింది అబ్బాయిలనే అనా? ఎందుకీ తేడా?? ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, మిగతా ఇద్దరు కనీసం క్షమాపణలు కూడా అడగలేదు.. పాపం చలపతిరావు గారు వెర్రోడు కాబట్టే క్షమాపణలు కోరుకున్నారు.. ఇంతటితో వదిలేయొచ్చుగా... ఆహా!! దేశంలో ఇదొక్కటే అతి పెద్ద సమస్య అన్నట్టు దాన్నే పట్టుకొని ఊగిపోవడం.. ఇక్కడ నువ్వు మొదటి సారి తప్పు జరిగినప్పుడే స్థాయిని బట్టి కాకుండా సమస్యని బట్టి నిలదీసుంటే, ఇలా ఇంకొకరు మట్లాడేవాళ్ళు కాదు..

నాన్న విలువ...

Image
నాన్న విలువ... కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, బయటకి వచ్చాక నాన్న ఆయన చచ్చే వరకూ మనల్ని అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు... అదీ నాన్న ప్రేమ.. మాటల్లో చెప్పలేనిదీ, చేతల్లో చూపించలేనిదీ.. ఏ కవీ రాయనిదీ... మన పెద్దవాళ్ళు, అమ్మ కడుపు చూస్తుంది అంటారు కానీ నావరకు అమ్మ కడుపు చూస్తే నాన్న పిల్లలకి అవసరమయ్యే డబ్బుల్ని చూస్తాడు... తన పిల్లలు సమాజంలో ఎవరి ముందూ తక్కువగా ఉండకూడదు అనే ఒకే ఒక్క పాయింట్ కోసం కష్టపడుతూనే ఉంటాడు, పడుతూనే చస్తాడు... నువ్వు ఓడిపోయినప్పుడు నీ వెంటే వుండి ప్రోత్సహించడానికీ, గెలిచినప్పుడు నా కొడుకు/కూతురు అని గర్వంగా ఊరంతా చెప్పుకోవడానికి వెర్రెత్తిపోయే పిచ్చోడే  "నాన్న"... అటువంటి మారాజులకి మనం ఇస్తున్న గౌరవం, తక్కువ చేసి మాట్లాడడం, తన్నడం.. అనాధాశ్రమంలో చేర్పించడం... నాన్నకి తెలిసిందొక్కటే, ఊరంతా ఒకవైపు వుండి నువ్వు ఒక్కడివే ఇంకో వైపు వుంటే వేరే ఆలోచనే లేకుండా నీవెంటే నిలబడడం... తినవలసిన మనుషులు నలుగురు వుండి, భోజనం ఇద్దరికే వుంటే.. ఎందుకో నాకు ఈరోజు ఆకలిగా లేదు అని అమ్మ అంటే.. మద్యాన్నం తిన్నదే ఇంకా అరగలేదు అని అబద్ధం చెప్

అమ్మకో ఫోన్ కాల్...

Image
అమ్మకో ఫోన్ కాల్... ప్రొద్దున్నే 8 కి నిద్ర లేచి 9 కల్ల తయారై భార్య ఏం టిఫిన్ చేసిందో కూడా గమనిచకుండా కొంచెం తినేసి బస్ స్టాప్ కి ఉరుకులు.. ఇది పట్టణాలలో మన ఉరుకులు పరుగుల జీవితం.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇవే పరుగులు... ఈ మధ్యలో ఊరి నుంచి మన అమ్మగారో లేదంటే నాన్నగారో ఫోన్ చేస్తే మేనేజర్ పక్కనే ఉన్నాడు లేదంటే మీటింగ్ లో ఉన్నాను తర్వాత కాల్ చేస్తా అని అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినకుండా ఫోన్ పెట్టేయడమే.. పోనీ నీ బిజీ తగ్గాక ఫోన్ చేస్తున్నావా అంటే అదీ ఉండదు... తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తేనే మనకి ఆ విషయం గుర్తొచ్చేది... పట్టణాలలో కుటుంబాన్ని నెగ్గుకురావాలంటే ఇవి తప్పవు నేనూ ఒప్పుకుంటా కానీ, కన్నోళ్ళకి కనీసం 9 నిమిషాలు కేటాయించలేని ఈ జీవితం ఎందుకండి?? జీతం ఇచ్చేవాడికోసం రోజుకి 9 గంటలు ఇస్తున్నాం.. మరి 9 నెలలు మోసి కని పెంచిన నీ తల్లి కోసం 9 నిమిషాలు ఇవ్వలేవా?? ఏ... నీకు నచ్చిన సినిమా రిలీజ్ అయితే ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ హాల్ కి వెళ్తావే.. మరి నువ్వే నచ్చిన నీ తల్లికి కి ఒక్క 9 నిమిషాలు ఆఫీస్ అయిపోయాక ఇవ్వలేవా?? నీకంటే పట్టణంలో స్నేహితులు, షికార్లు, సినిమాలు ఇల

చిరిగిన నోటు...

Image
చిరిగిన నోటు... పట్టణాలలో ఉధ్యోగరీత్యా మనం చాలా ప్రాంతాలకి వెళ్ళాల్సి ఉంటుంది... ఇల్లు ఒక చోట ఉంటే ఉధ్యోగం చేయాల్సిన చోటు ఇంకెక్కడో ఉంటుంది...కానీ తప్పదు మన కోసం మనల్నే నమ్ముకున్న కుటుంబం కోసం పరిగెట్టాల్సిందే... ఇలానే సాగే మన రోజుల్లో ఏదో ఒకరోజు మనం బస్సు కండక్టర్నో లేక ఆటో వాడినో 500 కి చిల్లర అడుగుతాం.. వాడు ఇస్తాడు... ఆ చిల్లర లో ఒక 100 నోటు చిరిగిపొయింది వచ్చిందనుకోండి... ఇక వాడిని ఏసుకుంటాం చూడండి మాములుగా కాదు... చిరిగిన నోటు చూడగానే : 1. వారినీ ఈ ఆటో/కండక్టర్ గాడు దెబ్బేసేసాడు రా.. 2. అసలు ఈ ఆటోగాళ్ళే అంత... ఎప్పుడు మోసం చేద్దామా అని ఎదురు చూస్తుంటారు... 3. నా 100 దొబ్బినోళ్ళు వాళ్ళేం బాగుపడతారు.. వాడు, వాడి కుటుంబం రోడ్డున పడాల్సిందే.... 4. అసలు ఈ ఇండియానే ఇంత.. దరిద్రపు దేశం.... కాసేపు ఆగాక : 1. ఇప్పుడు ఈ చిరిగిన నోటుని ఎవడికి అంటగట్టాలి? 2. లేదంటే మనకి 100 లాసు. ఇప్పుడు మనకి కూల్ డ్రింక్ తాగాలని అస్సలు లేకపోయిన ఏదో ఒక షాప్ కి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని ఆ చిరిగిన 100 ఇస్తాం బాగున్న వైపు పైకి చుపిస్తూ... కనిపెడతాడా లేదా అని చిన్న సందేహం మనసులో... షాప

అమ్మ కొడుకు...

Image
అమ్మ కొడుకు... ఒకప్పుడు అందరూ చక్కగా పల్లెటూళ్ళోనే ఉంటూ, హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం కొనసాగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉద్యోగాల పేరిట లేదంటె మెరుగైన వసతుల పేరిట పట్టణాలకు బయలుదేరుతున్నారు.. పల్లెలను/పల్లెటూర్లను అనాధలను చేస్తున్నారు. మీరు పట్టణాల్లోనే వుంటే ఈ "అమ్మ కొడుకు" అనే పదాన్ని వినే అవకాశమే లేదు... కానీ మీ వంశ వృక్షం పల్లెటూర్లలోనే వున్నట్లైతే ఇది మీరు వినే అవకాశం వుంది.. సాధారణంగా మనం పండగలకో లేదంటే ఏదైనా పని పడినప్పుడో మన సొంతవూర్లకి వెళ్తుంటాం... అప్పుడు ఎదురు వచ్చిన ప్రతి ఒక్కరు మనల్ని పలుకరించడం ఆనవాయితి...  ఇప్పుడేనా రావడం అనేది మొదటి ప్రశ్న ఐతే ఏం చేస్తున్నావ్ అనేది రెండో ప్రశ్న. ☺☺ అవి మన పల్లెటూరి అనుబంధాలు... మీకు ఎదురు వచ్చిన వాళ్లకి మీరు తెలిస్తే ఏం ప్రోబ్లెం లేదు.. కానీ తెలియకపొతే మొదటి ప్రశ్న ఎవరి అబ్బాయివి/అమ్మాయివి అని?? అందుకు సమాధానంగా మనం ఫలానా రామకోటేశ్వర రావు గారి అబ్బాయిని అనో శ్రీనివాసర రావు గారి అమ్మాయిని అనో చెప్తాం.. ఇక్కడే నాకు ఒక ప్రశ్న తలెత్తింది..... ఎందుకు మనం మన అమ్మ గారి పేరు చెప్పడం లేదు లేదంటే మనం చెప్పినా వాళ్