చిరిగిన నోటు...

చిరిగిన నోటు...


పట్టణాలలో ఉధ్యోగరీత్యా మనం చాలా ప్రాంతాలకి వెళ్ళాల్సి ఉంటుంది... ఇల్లు ఒక చోట ఉంటే ఉధ్యోగం చేయాల్సిన చోటు ఇంకెక్కడో ఉంటుంది...కానీ తప్పదు మన కోసం మనల్నే నమ్ముకున్న కుటుంబం కోసం పరిగెట్టాల్సిందే...
ఇలానే సాగే మన రోజుల్లో ఏదో ఒకరోజు మనం బస్సు కండక్టర్నో లేక ఆటో వాడినో 500 కి చిల్లర అడుగుతాం.. వాడు ఇస్తాడు...
ఆ చిల్లర లో ఒక 100 నోటు చిరిగిపొయింది వచ్చిందనుకోండి...

ఇక వాడిని ఏసుకుంటాం చూడండి మాములుగా కాదు...

చిరిగిన నోటు చూడగానే :

1. వారినీ ఈ ఆటో/కండక్టర్ గాడు దెబ్బేసేసాడు రా..
2. అసలు ఈ ఆటోగాళ్ళే అంత... ఎప్పుడు మోసం చేద్దామా అని ఎదురు చూస్తుంటారు...
3. నా 100 దొబ్బినోళ్ళు వాళ్ళేం బాగుపడతారు.. వాడు, వాడి కుటుంబం రోడ్డున పడాల్సిందే....
4. అసలు ఈ ఇండియానే ఇంత.. దరిద్రపు దేశం....

కాసేపు ఆగాక :

1. ఇప్పుడు ఈ చిరిగిన నోటుని ఎవడికి అంటగట్టాలి?
2. లేదంటే మనకి 100 లాసు.

ఇప్పుడు మనకి కూల్ డ్రింక్ తాగాలని అస్సలు లేకపోయిన ఏదో ఒక షాప్ కి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని ఆ చిరిగిన 100 ఇస్తాం బాగున్న వైపు పైకి చుపిస్తూ...
కనిపెడతాడా లేదా అని చిన్న సందేహం మనసులో... షాప్ వాడు గమనించాడే అనుకోండి.. వెంటనే అవునా చిరిగిందా? ఎక్కడా? అని ఎదవ నాటకాలు ఆడుతూ లోపల ఆ నోటు వెనక్కి వచ్చినందుకు బాధ పడుతూ ఇంకో నోటు ఇస్తాం...
వెంటనే రోడ్ ప్రక్కన ఏవో పునుగులొ బజ్జీలొ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళి అలాగే సేల్ చేయాలని చూస్తాం... వాళ్ళు కస్టమర్స్ని చూసుకొనే తొందర్లో ఈ నోటుని సరిగ్గా చూసుకోకుండా గల్లా పెట్టెలొ వేసుకోవడం... ఇక చూడండి మన ఆనందానికి హద్దే వుండదు...

కాకపోతే ఇక్కడ నాకు అర్ధం కాని విషయాలు ఎంటంటే,

ఆటో వాడు మోసం చేసాడు అని అంతగా తిట్టిన నువ్వు చేసిందేమిటి?? మోసం కాదా??
ఆటో వాడు ఒక ఉద్యోగిని మోసం చెస్తే నీకు అంత కోపం వచ్చింది.. నువ్వు రోడ్ మీద జీవనాధారంతో బ్రతికే వాళ్ళని మోసం చేసినప్పుడు వాళ్ళకి ఆనందం వస్తుందా??
నోటు చూసుకోకుండా తీసుకున్నందుకు నువ్వు అంతలా ఆనందపడ్డావే? ఒక మనిషిని మోసం చేసినందుకు నువ్వు ఆనందపడుతున్నావా??

వీటన్నిటిని చూస్తుంటే మనిషి మోసం చేసినందుకు ఆనందపడుతున్నాడు, చిరిగిన నోటు సేల్ అయినందుకు ఆనందపడుతున్నాడు.

డబ్బు+మోసం = ఆనందం ( ఇలా చెప్పాలంటే భాధగా ఉంది!!)

                                                                                                                          లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Post a Comment

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...