Posts

Showing posts from January, 2018

మన ఊరి 'సంక్రాంతి'!!

Image
మన ఊరి 'సంక్రాంతి'!! ఆగస్ట్ లో అందరినీ సెలవుల కోసం విసిగించేయడాలు సెప్టెంబర్ నుంచే పండగ గురించి ఆలోచనలు నవంబర్ లో ఏం నాటకాలు వేయాలా మన వాళ్ళ కోసం అని జుట్టు పీక్కోవడాలు డిసంబర్ లో డ్యాన్స్ లు ఏం నేర్చుకోవాలి స్టేజ్ మీద వేయడానికి అని ఆత్రుతలు జనవరి 1st ఒక పండగే కాదన్నట్టు పక్కకి తిరిగి పండగ కోసం ఎదురు చూపులు ఇవండి తెలుగు పల్లెల్లో పుట్టిన ప్రతొక్కడూ ఎదురు చూసే క్షణాలు... కొన్న కొత్త బట్టలు సంచుల్లో సర్దుకొని ఒక పది రోజుల పాటు ఈ పట్టణంతో పనే లేదన్నట్టుగా ముందుగానే మనం బుక్ చేసుకున్న సీట్ ఎక్కడుందా అని తిరుగుతున్న వేళ వస్తుందండి మనల్ని మన వూరికి ఆప్యాయంగా తీసుకెళ్ళే మన మిడిల్ క్లాస్ విమానం అదేనండి "రైలు బండి"!! వూరి దగ్గర్లోని స్టేషన్ లో దిగీ దిగగానే, మన పరిసరాల్లోకి వచ్చేశామనే భావన ఇక అక్కడినుంచి కాలు ఆగదు.. ప్రతీ బస్సు మనూరికే వెళ్తే బాగుండు అని అనుకోవడాలు సీట్ లు లేవని కండక్టర్ చెప్పినా పర్లేదండి అని బ్యాగ్ లు పైన పెట్టి నుంచోడానికి సిద్దమవడాలు బస్సు కొట్టే హారన్ అయినా వినసొంపైన సంగీతంలా వినబడడాలు చేలల్లో వూగే పైరు మనకి స్వాగతం చెప్తున్నట్టు చెయ్యి వూపడాలు కాలుష