Posts

బద్దకమే అభివృద్దా??

Image
బద్దకమే అభివృద్దా?? తప్పక చేస్తున్నామో తప్పనిసరై చేస్తున్నామో మనకి మనమే తెలుసుకోలేని కొన్ని విషయాలివన్నీ.. అభివృద్ది అని ముందుకెళ్తున్నామో.. ఎంత చేసినా మన పెద్దవాళ్ళ ఆయుషుని అందుకోలేకపోతున్నామో తెలీదు కానీ.. బద్దకమే మనం సాధించిన అతి పెద్ద అభివృద్ది అని చెప్పడంలో ఎటువంటి అతిశయం లేదు.!! చదివాక మీ మాట కూడా అదే కావొచ్చు!! వేప పుల్లలతో పళ్ళు తోముకుంటే చాలా మంచిది అని తెలుసూ.. కానీ వంట గదిలో వున్న వస్తువులన్నీ పేస్ట్ లో కుక్కి బ్రష్ మీద వేస్తేనే మనకిష్టం.. పుల్లలతో తోముకుంటే మన కంటబడని ఎన్నో దంత రోగాలు వీటి వాడకం మొదలవ్వగానే వచ్చాయని బాధపడాలో సమయం చాలా ఆదా అయిందని ఆనందపడాలో అర్ధం కాని పరిస్థితి!! కుంకుడు కాయలతో తలస్నానం అన్ని పోషకాలు జుట్టుకి అందివ్వడం అని తెలుసూ.. షాంపూ ఐతే కళ్ళు మండవు.. పైగా చాలా త్వరగా అయిపోద్ది అని, షాంపూలతో ఆరోగ్యంగా వున్నదాన్ని చెడగొట్టి బట్ట తలలు తెచ్చుకుంటున్నాం అని బాధపడాలో బోడి గుండయ్యాక రోజూ దువ్వుకునే బాధ తప్పిందని ఆనందపడాలో అర్ధం కాని పరిస్థితి!! పట్టుమని పదినిమిషాల నడకైనా వుండధు... కార్ బుక్ చేస్తాం లేదంటే ఆటో కావాల్సిందే.. బద్దకం వల్ల రోగ

మనగురించి మనమొప్పుకోని 'నిజాలు'

Image
మనగురించి మనమొప్పుకోని 'నిజాలు'!! చదువు చెప్పిన గురువుల్ని గౌరవించడం తెలీదు కానీ, టీచర్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు? నిన్ను కన్న నీ తల్లికి ఇంట్లో బాగలేకపోఇనా మనకి పట్టదు కానీ, మదర్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు? నాన్న తిట్టాడని స్నేహితుల ముందు ఆయన్ని తిట్టడం వచ్చు కానీ, ఫాదర్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు? ఒంటరిగా కనిపించే స్త్రీలని గౌరవించడం తెలీదు కానీ, వుమన్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు? స్త్రీలని సమానంగా చస్తే చూడలేవు కానీ, వుమన్స్ సమానత్వం డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు? ప్రేమించిన అమ్మాయికి సైతం తనకిస్టమైన వాడిని ఎంచుకునే స్వేచ్చ వుందని నమ్మవు కానీ, వాలెంటైన్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు? ఆస్తుల విషయంలో అక్కా చెల్లెళ్ళని తరిమేయడానికి వెనకాడవు కానీ, సిస్టర్స్ డే కి మాత్రం సోషల్ సైట్స్ లో పోస్టులు మెసేజులు శుభాకాంక్షలెందుకు? పక

ప్రేమాంతర్యామి..!!

Image
ప్రేమాంతర్యామి..!!  లంగా వోణీ వేసుకొని పద్దతిగా వుంటే నాకిష్టం, జీన్స్ స్కర్ట్స్ లు వేసుకొని పోష్ గా వుండడం తనకిష్టం!! ఉత్తరాల ద్వారా ప్రేమని తెలియజేయడం నాకిష్టం, ఫోన్ లు వాట్సాప్ లతో ప్రేమ ని వ్యక్తపరచడం తనకిష్టం!! తనతో కలిసి గుడికెళ్ళడం నాకిష్టం, సినిమాలు, షికార్లు అంటూ తిరగడం తనకిష్టం!! అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు పొలమారితే నీళ్ళందించడం నాకిష్టం, ఫ్లోర్ మీద డాన్స్ చేస్తూ షాట్స్ తాగడం తనకిష్టం!! పది దాటితే హాయిగా నిద్రపోవడం నాకిష్టం, అర్ధరాత్రైనా అర్ధం పర్ధం లేని సొల్లు వాగితే తనకిష్టం!! పెద్దోళ్ళందరినీ ఒప్పించి పెళ్ళిచేసుకోవడం నాకిష్టం, ఎవరూ ఒప్పుకోకపోయినా పర్లేదు లేచిపోయి పెళ్ళిచేసుకోవడం తనకిష్టం!! పెళ్ళయ్యాక ఉమ్మడి కుటుంబంగా వుండడం నాకిష్టం, మనకంటూ ఎవరూ లేకుండా ఏకాకుల్లాగా వుంటే తనకిష్టం!! వచ్చే డబ్బులు సరిపోకపోతే వున్నంతలో కాళ్ళు ముడుచుకోవడం నాకిష్టం, రాబడితో పొంతనే లేకుండా హంగులు ఆర్భాటాలంటే తనకిష్టం!! అమ్మాయి పుడితే మా అమ్మే మళ్ళీ పుట్టిందనుకోవడం నాకిష్టం, మా అమ్మే పుట్టిందని అనకుండా వుంటే తనకిష్టం!! అమ్మనీ, తననీ ఒకేలా చూసుకోవడం నాకిష్టం,

ఒకప్పుడు - ఇప్పుడు - పెళ్ళయ్యాక

Image
ఒకప్పుడు - ఇప్పుడు - పెళ్ళయ్యాక కాలాన్ని బట్టి మనిషి మారుతూ ఉంటాడు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు.. నిజమే నండీ.. కావాలంటే ఇవి చదవండి.. ఒక్కో ప్రాయంలో ఒక్కోలా ఎలా ప్రవర్తించామో మీకే తెలుస్తుంది!! స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు: చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తారని యునిఫాం వేసుకొని స్కూల్ కి వెళ్ళాం అప్పుడు ఆఫీస్ కి సెలవు ఇచ్చారు.. రోజంతా హ్యాప్పీ గా నిద్రపోవచ్చు అని ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి పంపితే ఇంట్లో ఏ అల్లరీ వుండదు అని పెళ్ళయ్యాక!! గాంధీ జయంతి రోజు: స్కూల్ కి సెలవు..స్నేహితులతో క్రికెట్ ఆడుకోవచ్చని అనుకున్నాం అప్పుడు ఆఫీస్ లేదు సరే.. ఆఫీసర్స్ చాయిస్ అయినా దొరికితే బాగుండు అని ఇప్పుడు పనేం లేదు కాబట్టి పెళ్ళాంతో ఫస్టు షోకి వెళ్దాం అని పెళ్ళయ్యాక!! గాంధీ జయంతి రోజు: స్కూల్ కి సెలవు..స్నేహితులతో క్రికెట్ ఆడుకోవచ్చని అనుకున్నాం అప్పుడు ఆఫీస్ లేదు సరే.. ఆఫీసర్స్ చాయిస్ అయినా దొరికితే బాగుండు అని ఇప్పుడు పనేం లేదు కాబట్టి పెళ్ళాంతో ఫస్టు షోకి వెళ్దాం అని పెళ్ళయ్యాక!! మదర్స్ డే రోజు: అలాంటి రోజొకటి వుందని కూడా మనకి తెలీదు అప్పుడు మేనేజెర్ ఇచ్చిన పని చేయడం తోనే సరిపోయ

వధువులూ మారారు..!!

Image
వధువులూ మారారు..!! మొదటగా అబ్బాయికి అమ్మాయి నచ్చాలి.. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి పిమ్మట అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి కానీ సరే అనం జాతకాలు కలవాలి జ్యోతిష్యుడి సమ్మతం కావాలి ఈ తంతులన్నీ ముగిశాక పెట్టేదెంత పుచ్చుకునేదెంత అనే లావాదేవీలు మాట్లాడుకోవాలి అప్పుడే నిశ్చయ తాంబూలాల మార్పిడి!! ఇప్పటికీ పెళ్ళి కాని సగం మంది అబ్బాయిలకి బోధపడని కొన్ని విషయాలు!! పల్లెలో ప్రశాంతంగా బ్రతుకుదాం అంటే వద్దంటున్నారు పట్టణంలో పరిగెత్తుదాం అంటే ముద్దంటున్నారు!! కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా అంటే వద్దంటున్నారు కడుపు చేసి పారిపోతా అంటే ముద్దంటున్నారు!! ప్రేమానురాగాలు చూపిస్తా అంటే వద్దంటున్నారు పైసల్నే నీకోసం బాగా ఖర్చు చేస్తా అంటే ముద్దంటున్నారు!! ఫ్యామిలీతో గొడవలు ఏం లేవు అంటే వద్దంటున్నారు ఫ్యాక్షన్లో ఆరితేరాను అంటే ముద్దంటున్నారు!! రోగాలే లేని రైతుల్ని వద్దంటున్నారు రోగాల్నే ఆస్తులుగా చెప్పుకునే సాఫ్ట్ వేర్ని ముద్దంటున్నారు!! బంగారమంటి మనసున్న వాడిని వద్దంటున్నారు బంగారం మాత్రమే వున్న బంగార్రాజుల్ని ముద్దంటున్నారు!! కాళ్ళని నమ్ముకున్న వాళ్ళని వద్దంటున్నారు కార్లని నమ్ముక

పట్టణంలో ఇంటికోసం..!!

Image
పట్టణంలో ఇంటికోసం..!! ఈ కాలంలో 7వ తరగతి కూడా పోటా పోటీనే 10వ తరగతి బాగా చదివితే, ఇంటర్ లో ఫ్రీ సీట్ గ్యారంటీ ఇంటర్ లో బాగా చదివితేనే, ఎంసెట్ లో ర్యాంకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తేనే, మంచి కాలేజ్ లో భ్.టెచ్ సీట్ మంచి కాలేజ్ లో సీట్ వస్తేనే క్యాంపస్ సెలక్షన్స్ కి అవకాశం క్యాంపస్ సెలక్షన్స్ వస్తేనే అద్భుతమైన కొలువు ఇక మొదలు ఉద్యోగ కష్టాలు చెప్పుకోవడానికి సమయముండదు, చూపిద్దాం అంటే తల్లిదండ్రులుండరు!! ఇలా ప్రతీదానికీ హడావిడే.. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం చాలా నయం అని ఏ మహానుభావుడు చెప్పాడో కానీ ఇప్పుడాయన వుంటే పోవయ్యా బా చెప్పావ్ కానీ, పిల్లల్ని చెడగొట్టడానికే వచ్చినట్టున్నావ్ అని తరిమి తరిమి కొడతారు. మనం అంతలా సంపాదించి చేసేదేమిటో తెలుసా అండి పట్టణంలో ఒక ఇల్లు కొనుక్కోవడం. అదే ఇప్పుడు సమాజంలో అందరికీ కావాల్సిన గౌరవం. జీతం తక్కువైతే లోన్ ఐనా తీసుకొని ఇల్లు కొన్నుక్కో కానీ ఇల్లు కొనకుండా వూళ్ళో వున్న ఇంటి గడప తొక్కడానికి వీళ్ళేదని శాసనాలు!! ఇంతలా పరిగెట్టి, తినీ తినక నిద్ర పోయీ పోక కూడబెట్టిన నాలుగు రాళ్ళు పట్టణంలో పోసి ఒక ఇల్లు కొనుక్కునేసరికి 60

మన ఊరి 'సంక్రాంతి'!!

Image
మన ఊరి 'సంక్రాంతి'!! ఆగస్ట్ లో అందరినీ సెలవుల కోసం విసిగించేయడాలు సెప్టెంబర్ నుంచే పండగ గురించి ఆలోచనలు నవంబర్ లో ఏం నాటకాలు వేయాలా మన వాళ్ళ కోసం అని జుట్టు పీక్కోవడాలు డిసంబర్ లో డ్యాన్స్ లు ఏం నేర్చుకోవాలి స్టేజ్ మీద వేయడానికి అని ఆత్రుతలు జనవరి 1st ఒక పండగే కాదన్నట్టు పక్కకి తిరిగి పండగ కోసం ఎదురు చూపులు ఇవండి తెలుగు పల్లెల్లో పుట్టిన ప్రతొక్కడూ ఎదురు చూసే క్షణాలు... కొన్న కొత్త బట్టలు సంచుల్లో సర్దుకొని ఒక పది రోజుల పాటు ఈ పట్టణంతో పనే లేదన్నట్టుగా ముందుగానే మనం బుక్ చేసుకున్న సీట్ ఎక్కడుందా అని తిరుగుతున్న వేళ వస్తుందండి మనల్ని మన వూరికి ఆప్యాయంగా తీసుకెళ్ళే మన మిడిల్ క్లాస్ విమానం అదేనండి "రైలు బండి"!! వూరి దగ్గర్లోని స్టేషన్ లో దిగీ దిగగానే, మన పరిసరాల్లోకి వచ్చేశామనే భావన ఇక అక్కడినుంచి కాలు ఆగదు.. ప్రతీ బస్సు మనూరికే వెళ్తే బాగుండు అని అనుకోవడాలు సీట్ లు లేవని కండక్టర్ చెప్పినా పర్లేదండి అని బ్యాగ్ లు పైన పెట్టి నుంచోడానికి సిద్దమవడాలు బస్సు కొట్టే హారన్ అయినా వినసొంపైన సంగీతంలా వినబడడాలు చేలల్లో వూగే పైరు మనకి స్వాగతం చెప్తున్నట్టు చెయ్యి వూపడాలు కాలుష