పట్టణంలో ఇంటికోసం..!!

పట్టణంలో ఇంటికోసం..!!



ఈ కాలంలో 7వ తరగతి కూడా పోటా పోటీనే
10వ తరగతి బాగా చదివితే, ఇంటర్ లో ఫ్రీ సీట్ గ్యారంటీ
ఇంటర్ లో బాగా చదివితేనే, ఎంసెట్ లో ర్యాంకు
ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తేనే, మంచి కాలేజ్ లో భ్.టెచ్ సీట్
మంచి కాలేజ్ లో సీట్ వస్తేనే క్యాంపస్ సెలక్షన్స్ కి అవకాశం
క్యాంపస్ సెలక్షన్స్ వస్తేనే అద్భుతమైన కొలువు
ఇక మొదలు ఉద్యోగ కష్టాలు
చెప్పుకోవడానికి సమయముండదు, చూపిద్దాం అంటే తల్లిదండ్రులుండరు!!

ఇలా ప్రతీదానికీ హడావిడే..
పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం చాలా నయం అని ఏ మహానుభావుడు చెప్పాడో కానీ
ఇప్పుడాయన వుంటే పోవయ్యా బా చెప్పావ్ కానీ, పిల్లల్ని చెడగొట్టడానికే వచ్చినట్టున్నావ్ అని తరిమి తరిమి కొడతారు.

మనం అంతలా సంపాదించి చేసేదేమిటో తెలుసా అండి
పట్టణంలో ఒక ఇల్లు కొనుక్కోవడం.
అదే ఇప్పుడు సమాజంలో అందరికీ కావాల్సిన గౌరవం.
జీతం తక్కువైతే లోన్ ఐనా తీసుకొని ఇల్లు కొన్నుక్కో కానీ
ఇల్లు కొనకుండా వూళ్ళో వున్న ఇంటి గడప తొక్కడానికి వీళ్ళేదని శాసనాలు!!

ఇంతలా పరిగెట్టి, తినీ తినక నిద్ర పోయీ పోక కూడబెట్టిన నాలుగు రాళ్ళు
పట్టణంలో పోసి ఒక ఇల్లు కొనుక్కునేసరికి 60 యేళ్ళు నిండిపోతాయి.
ఆ వయస్సులో పట్టణంలో రద్దీకి వుండలేక
ఈ కాలుష్యం మన ఆరోగ్యానికి సరిపడక
లేదంటే కోడళ్ళు కంచంలో అన్నం పడేయట్లేదని అభిమానం చంపుకోలేక
మళ్ళీ తిరిగి తిరిగి సొంత గూటికే చేరుకుంటాం.. అదేనండీ మన సొంత వూళ్ళో ఇంటికి..

ఆ మాత్రం దానికి, అలుపూ సొలుపూ లేని ఆ నడకలెందుకు
డబ్బు మీద మాత్రమే ఆ వ్యామోహమెందుకు? సంపాదించిన ఆ నాలుగు రాళ్ళు చేతిలో పట్టుకొని
పిల్లల్ని ప్రయోజకుల్ని చేయగానే వాళ్ళకీ ఎగిరే అవకాశం ఇచ్చి
వూరిలోని ఇంట్లో మడత కుర్చీ లో కూర్చొని భగవద్గీత వింటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తే ఎంత బావుంటుంది!!

                                                                                                                                   లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...