ఎక్కడ రైతు..?

ఎక్కడ రైతు..?


1960-70 ల్లో మన పెద్దవాళ్ళు ఉద్యోగం వచ్చినా వెళ్ళేవాళ్ళు కాదు.. ఎందుకంటే అప్పుడు వ్యవసాయానికి ఉన్న గౌరవం అలాంటిది..
ఎవరికిందా పని చేయాల్సిన అవసరం లేదు.. ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పనే లేదు.. ఉన్న భూమినే సాగు చేసుకుంటూ, గర్వంగా తలెత్తుకొని వ్యవసాయం చేసేవాళ్ళు..
అలా తలెత్తుకొని తిరిగిన ఆ రైతులే  ఇప్పుడు పొట్ట చేతపట్టుకొని భార్యాబిడ్డలతో పట్టణానికి తలదించుకు పోవాల్సిన పరిస్థితి...

పట్టణాలలో పరిశ్రమలకి పగలు పూటే కరెంట్ ఇచ్చే మన ప్రభుత్వం , పల్లెల్లో నివశిస్తున్న రైతుల పొలాలకి రాత్రుళ్ళే ఎందుకు కరెంట్ ఇస్తుంది...??
ఎందుకంటే.. ఇక్కడ ప్రభుత్వానికి డబ్బులు కడతారు.. అక్కడ రైతులు కట్టరు కాబట్టి.. కట్టరు కాదు కట్టలేని పరిస్థితి వాళ్ళది... ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో జరిగే బిజినెస్, అక్కడ చిన్న చిన్న రైతుల నోరు మూసే ప్రాసెస్..
పరిశ్రమలు రావడం మంచిదే.. మన పిల్లలకి మంచి కొలువులు వస్తాయి. వాళ్ళు ఏ కష్టాలూ పడకుండా హాయిగా జీవిస్తారు...
అసలు రైతు అంటే కష్టాల పుట్ట అనే పేరు తెచ్చింది ఎవరు?? మనం కాదా??

నాణ్యమైన విత్తానాలు రైతులకి దొరకనివ్వం.. 10 విత్తనాలు నాటితే రెండే బ్రతుకుతాయ్..
పంటకి ఏదైనా పురుగు పడితే ఆ విత్తనాలు తట్టుకోగలవా??  పోనీ ఏదైనా మందు కొడదాం అంటే
అవి పంటను బ్రతికించడానికి కాకుండా పండించే వాడి ప్రాణాలు తీయడానికే ఎక్కువగా ఉపయోగపడతాయ్.
తర్వాత పెరిగిన రోజూవారి కూలీల ఖర్చులు.. అప్పో సొప్పో చేసి వాటన్నిటినీ దాటుకు వస్తే..
పంట బాగా పండిన సంవత్సరం గిట్టుబాటు ధర ఉండదు.. ధర బాగా వుందని అనుకునేలోపే సరిగ్గా పండని పంట రైతుల్ని ఎక్కిరిస్తూ వుంటుంది...

ఇంకెలా ఈ వ్యవసాయం చేసేది.. భారతదేశానికి వెన్నెముకగా నిలబడేది..
ఒకప్పుడు 25 kgల బియ్యం 500 రూపాయలు ఉంటే ఇప్పుడు 1500 ఉంది.. కానీ అందులో రైతులకి వెళ్తుంది ఎంత..??
ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా మానేస్తే దిగుబడి బాగా పడిపోయి 3000 పెట్టి 25 kg బియ్యం కొనాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయంగా ఉన్నా..
ఇంకో పక్క ఆనందంగా కూడా ఉంది.. అప్పుడైనా రైతు రాజ్యం వస్తుందేమో అన్న చిన్న ఆశ...
రైతే దేశానికి రారాజు అనే పిచ్చి మాటలు కట్టి బెట్టి, రైతుల్ని కనీసం మనుషులుగా చూడడం మన సమాజానికి నేర్పించాల్సిన తరుణం ఆసన్నమైంది..!!


                                                                                                                                      లక్ష్మీనాథ్ దాసినశెట్టి   

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...