ఇదేనా దెయ్యమంటే..!!

ఇదేనా దెయ్యమంటే..!!

 
మనకి తెలిసిన అమ్మాయో, అబ్బాయో కొంచెం తేడాగా ప్రవర్తిస్తే చాలు.. వీడికి గాలి సోకిందిరా అంటాం లేదంటే వీడికేదో దెయ్యం పట్టిందంటాం.. కాకపోతే ఈ మాటలు పల్లెటూళ్ళకే సొంతం..
ఎందుకు ఇలాంటి మాటలు పల్లెటూళ్ళలోనే వినపడుతున్నాయ్.. అక్కడ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తే భూత వైద్యుడు దగ్గరకి తీసుకెళ్ళే మన జనం, పట్టణాలలో ఇలాగే జరిగితే మానసిక వైద్యుల దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నారు??
అదే మన మూఢనమ్మకం.. వాటిలో మునిగితే భూతవైద్యులు కొంచెం పక్కన పెట్టి ఆలోచిస్తే మానసిక వైద్యులు.

చిన్నప్పుడు అమ్మ మనం అన్నం తినకుండా మారాం చేసినా, లేదంటే బాగా అల్లరి చేస్తున్నా బయట బూచోడున్నాడు లేదంటే దెయ్యం ఉంది.. నువ్వు ఇలాగే అల్లరి చేస్తే అది వచ్చి నిన్ను తీసుకుపోతుంది అని భయపెడతారు...
అదీ అక్కడ పడింది మన మనసులో దెయ్యం అనే బీజం.. ఇక అక్కడినుంచి రాత్రి పూట ఒంటరిగా ఇంట్లో వుండాలంటే భయం.. 12 తర్వాత ఒంటరిగా బయటకెళ్ళాలన్నా భయం..
అసలు నిజంగా దెయ్యాలున్నాయంటారా??

మన పెద్దలు చాలా తెలివైన వాళ్ళు.. ఎందుకంటే ఎక్కడికక్కడ కండిషన్స్ అప్లయ్ అంటారు కాబట్టి...
వాటిలో కొన్ని, ఆ కొన్నింటి మీద నాకున్న ప్రశ్నలు..

1. ఒక మనిషి కోరికలు తీరకుండా చనిపోతే, దెయ్యాలు అవుతారు అంటారు...

నాకు తెలిసి భూమిమీద వున్న ప్రతీ మనిషికి కోరికలు ఉంటాయ్.. ఎవరైనా నా కోరికలు మొత్తం తీరిపోయాయి అని చెప్తే అది పచ్చి అబద్దం..
నీకు Swift కార్ ఉంటే, BMW కావాలనిపిస్తుంది అది కూడా కోరికే.. కాబట్టి మన పెద్దవాళ్ళ నియమం ప్రకారం చచ్చిన ప్రతీ వాళ్ళు దెయ్యాలుగా మారాలి..
అలా మారితే.. అందులో మన తాతయ్యో లేదంటే అమ్మమ్మో ఉంటారుగా..వాళ్ళు ఎందుకు మనల్ని చెడు దెయ్యాలనుంచి కాపాడడం లేదు??

2. దెయ్యాలకి బంధాలు,బాంధవ్యాలు ఉండవు అంటారు..

దెయ్యాలకి బంధాలు లేకపోతే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళమీద పగ కూడా ఉండకూడదుగా..?? రిలేషన్ ఉంటేనే కదా పగ తీర్చుకోవాలనుకునేది...

3.అందరికీ దెయ్యాలు కనపడవు.. కేవలం ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళకే దెయ్యాలు కనపడతాయ్ అంటారు...

సరే.. పట్టణాలలో మనం ఎక్కడపడితే అక్కడ ఎప్పుడుపడితే అప్పుడు తిరుగుతూనే ఉంటాం.. ఆ నక్షత్రం లోనే పుట్టిన వాళ్ళకి దెయ్యాలు పట్టణాలలో ఎందుకు
కనిపించడం లేదు?? పల్లెల్లోనే ఎందుకు కనిపిస్తున్నాయ్??

4.చేతబడులు ఉన్నాయ్ అంటారు.. దానివల్ల చాలా మంది నానా నరకాలు చూశారు అంటారు..

చేతబడులు ఉన్నాయ్ అంటే, మరి ఎందుకు అవి పెద్ద పెద్ద వాళ్ళ మీద పనిచేయవు?? ఉదాహరణకి KCR అంటే చాలా మంది ఆంధ్రా వాళ్ళకి కోపంగానే ఉంది..
మరి ఆయన మీద ఎందుకు చేతబడి ఎవరూ చేపించలేకపోతున్నారు? దానికి ఆయన బట్టలు, జుట్టు కావాలి అని పిచ్చి మాటలు చెప్పకండి.. అవి ఎలాగైనా సంపాదించొచ్చు..

5.చివరిగా, దెయ్యం తెల్ల చీర కట్టుకొని, జుట్టు విరబూసుకొని, వికారమైన మొహంతో, గోళ్ళు బాగా పెంచుకోని ఉంటుంది అంటారు..

ఎందుకంటే అలానే మనం సినిమాల్లో చూస్తాం కాబట్టి.. మన మెదడు వాటిని ఎలా ఐతే గుర్తు పెట్టుకుంటుందో అలానే ఊహించుకుంటూ భయపడుతుంది...
అవి అలా ఉంటేనే భయపడతారు.. లేదంటే దగ్గరికి వెళ్ళి హల్లో చెప్తారు..

ఇంకా దెయ్యాలు ఉన్నాయ్ అని వాదించే వాళ్ళు, తమ చివరి అస్త్రంగా దేవుడు ఉన్నాడు అంటే దెయ్యాలు కూడా ఉన్నట్టే అంటారు.. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే దెయ్యాల్ని కూడా నమ్మాల్సిందే అంటారు..
వాళ్ళకోసం, దేవుడున్నాడు అని నమ్మి గుడికెళ్తే ప్రశాంతత దొరుకుతుంది.. మనసులో ఏదో తెలియని సంతోషం కలుగుతుంది...
అదే దెయ్యాలు ఉన్నాయని నమ్మితే లేనిపోని భయాలు.. ఆ మూడనమ్మకాలతో చేసే మూర్కపు పనులు...
ఏదైనా మనిషికి మంచి చేస్తుంది అంటే దాన్ని గుడ్డిగా నమ్మొచ్చు తప్పు లేదు.. కానీ ఉపయోగం లేని ఈ మూడనమ్మకాలను నమ్మడం ఎందుకు?

                                                                                                                               లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...