హక్కూ - హాఫ్ బ్రాందీ!!

హక్కూ - హాఫ్ బ్రాందీ!!


ఏవే!! ఆ పసుపు రంగు పార్టీ వాళ్ళు డబ్బులివ్వడానికి వచ్చారా?? లేదక్కా ఈరోజొస్తారంటా.. సచ్చినోళ్ళు, ఎప్పుడైనా ఇవ్వాల్సిందేగా అదేదో త్వరగా ఇస్తే ఏం పోయింది..
ఆ టేబుల్ ఫ్యాన్ పార్టీ వాళ్ళు చూడు మొన్నే ఇచ్చి వెళ్ళారు.. ఇవే ఎన్నికల వేళల్లో మనకి తరచుగా వినిపించే మాటలు..
అవునక్కా!! మరి ఎవరికి ఓటు వేద్దామని అనుకుంటున్నావ్? ఏమోనే ముందు అందరినీ ఇవ్వనీ.. అందరిచ్చాక బాగా ఆలోచించి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తా..

ఇలా అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకొని ఓటు మాత్రం ఏ వొక్కడికో వేస్తాం..ఎవరో ఒక్కళ్ళకే ఓటు వేసేటప్పుడు అందరి దగ్గర డబ్బు తీసుకోవడమెందుకు చెప్పండి... మళ్ళీ అందులో ఖచ్చితంగా మీకే నా ఓటు అని
దీపాలు కూడా ఆర్పడం...  ఇదే విషయం మన పెద్దవాళ్ళని అడిగితే ఈ ఎన్నికలు వచ్చెదే ఏ 5 సంవత్సరాలకో అప్పుడే కదా మనకో 6000 దక్కేది అంటారు...
వాళ్ళు తీసుకుంటున్నారు అంటే కొంచెమైనా అర్ధం చేసుకోవచ్చు.. కానీ చదువుకున్న వాళ్ళు ఇలా డబ్బులకీ, క్రికెట్ కిట్ లకి లేదంటే బీర్ బిర్యానీ లకి అమ్ముడు పొతుంటేనే భారతమాత సిగ్గుతో తలవంచుకుంటుంది..

చదివినోడి కంటే చాకలోడు మేలన్నట్టుగా అన్నీ తెలిసిన నువ్వే అలా చేస్తుంటే ఇక లోకజ్ఞానం పెద్దగా తెలీని మన పల్లెటూరి జనాలు డబ్బు తీసుకొని ఓటు వేయడంలో తప్పు ఏంటి??
5000 రూపాయలు మనం హాస్టల్ కి కడితేనే ఎలాగైనా న్యాయం చేయాలని బాగా తినడానికి ప్రయత్నిస్తాం..  మరి అలాంటిది కోట్లు ఖర్చుపెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు మాత్రం ఎందుకూరుకుంటారు??
ఒకటి మాత్రం నిజం డబ్బు తీసుకొని ఓటు వేసినప్పుడే నువ్వు అతనికి హామీ ఇస్తున్నావు రేపు మన ఊరిలో ఏం జరిగినా నేను మాత్రం  నిన్ను అడగను అని...
అందుకే ఆ గెలిచిన ప్రజాప్రతినిధి ప్రజలకు మంచి చేయడం మీద కంటే మనీ సంపాదించడం మీదే  తన మనసుని లగ్నం చేస్తున్నాడు..

ఇక్కడ నువ్వు 6000 కి అమ్ముకుంది నీ ఓటుని కాదు నీ హక్కుని.. 6000 5 సంవత్సరాలకి అంటే రోజుకి 4 రూపాయలు.. నీ హక్కు విలువ మరీ 4 రూపాయలా..??
ఆ 4 రూపాయలు మనం ఎక్కడ ఖర్చు పెట్టడం లేదు చెప్పండి..  ప్రతినిధుల్ని అన్యాయాలమీద నిలబెట్టి కడిగేయాలంటే దయచేసి ఆ ఓటుకి డబ్బు తీసుకోవడం మానేయండి..
ఒక్కసారి డబ్బు తీసుకోకుండా  ఓటు వేసి చూడండి మనసుకి ఎంత ఆనందం కలుగుతుందో... ఎవడికీ సలాం చేయాల్సిన పని లేదు.. ఏం తప్పు జరిగినా ప్రతినిధిని పేకాడేయొచ్చు..
అయినా నిజాయితీలొ ఉన్న ఆనందం వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్లో ఉన్న ఆనందం ఎప్పటికీ ఒక్కటి కాదు..

వాళ్ళు ఇస్తున్నారు కాబట్టే తీసుకుంటున్నాం అని మిమ్మల్ని మీరు మోసం చేసుకొనే ప్రయత్నం చేయకండి,
మనం తీసుకోకపోతే వాళ్ళెందుకు ఇస్తారు? మన జీవితంలొ జరిగే ప్రతీ దానికి మనమే కారకులం.. ఎప్పుడూ పక్కనోళ్ళ మీద తప్పు నెట్టేసి తప్పించుకొనే ప్రయత్నం చేయొద్దు.. !!

                                                                                                                         లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...