మనకొచ్చిన స్వాతంత్ర్యం..!!

మనకొచ్చిన స్వాతంత్ర్యం..!!


స్వాతంత్ర్యం వచ్చింది,
పరిపాలన ఏమైనా మారిందా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
పాలించే వాళ్ళు ఏమైనా మారారా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
భారతదేశ దోపిడీ ఏమైనా మారిందా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
తప్పు చేసినోళ్ళని శిక్షించగలుగుతున్నామా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
అవినీతిపరులని నిలదీయగలుగుతున్నామా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
అమ్మాయిలు అర్ధరాత్రుళ్ళు బయటకి వెళ్ళగలుగుతున్నారా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
మర్డర్లు,మానభంగాలు ఆగిపోయాయా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
పేదోడి పొట్ట కనీసం నిండుతుందా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
రైతులు రారాజులు కాగలిగారా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
ప్రజలు నిరసనల పేరిట రోడ్డెక్కడం మానేశారా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
రూపాయి విలువేమైనా పెరిగిందా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
తెల్లవాడికి సలాం అనడం ఏమైనా ఆపేశామా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఆపేశామా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
అది తెచ్చిన వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకున్నామా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
స్వేచ్ఛా గాలి పీల్వగలుగుతున్నామా..?

స్వాతంత్ర్యం వచ్చింది,
ఇప్పుడున్న కుళ్ళు రాజకీయాలకోసం,
మంచీ మానవత్వం లేని మౄగాలకోసం,
ఆడబిడ్డలపై అత్యాచారాలకోసం,
పేదోడి పొట్ట కొట్టడం కోసం,
నీ దేశాన్ని తెల్లోడు కాకుండా నువ్వే దోచుకోవడం కోసం,
విచ్చలవిడిగా నేరాలు చేయడం కోసం.. అంతే కానీ మన దేశం కోసం అని చెప్పలేని దయనీయ పరిస్థితిలో ఉన్న మనకోసం!!

స్వాతంత్ర్యం వచ్చి 71 ఏళ్ళు అయింది అని సంకలు గుద్దుకోవడం ఆపి,
సామాన్యులకి మంచి చేయలేని స్వాతంత్ర్యం వచ్చిందని మనసుకు సర్దిచెప్పుకోవడం మేలు!!

                                                                                                                              లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...