పిరికివాడు..!!

పిరికివాడు..!!


ఈరోజు నాకు తాగాలనిపిస్తుందిరా అన్నాడో స్నేహితుడు..ఎందుకు అని అడిగితే, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదనింది అని సమాధానం..
దానికి తాగడం ఎందుకు? తాగితే కాదు అన్న అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి ప్రేమిస్తున్నా అంటుందా??

ఇంకొంతమంది, డబ్బు కష్టాలు లేదంటే కుటుంబ కష్టాలు అంటారు.. రెండూ పచ్చి అబద్దాలే.. డబ్బు కష్టాలు నిజంగా ఉన్నవాడైతే, వేలకు వేలు తగలేస్తూ ఈ తాగుడికి బానిస అవుతాడా??
తాగడానికి పెట్టే ఖర్చులో సగం చాలు వాడి డబ్బు కష్టాల్ని మొత్తం తీర్చుకోవడానికి..
కుటుంబ కష్టాలు, అవే పెళ్ళాలతో గొడవలు... నువ్వు ఈ రకంగా రోజూ తాగి ఇంటికెళ్తుంటే ఆ స్త్రీమూర్తి మాత్రం ఎందాకని  భరిస్తుంది.. అందుకే మానెయ్యమనో లేదంటే తక్కువ తాగమనో చెప్తుంది...
అర్ధం చేసుకోవడం మానేసి అరిచేస్తావు నువ్వు.. గొడవలు కాక ఇంకేముందీ..

కష్టాలు రాగానే మందు తాగి వాటిని మర్చిపోవడం ఏంటి? సరే తాగారు మర్చిపోయారు..
రేపు పొద్దున్నే లేవగానే ఆ కష్టాలు సుఖాలుగా మారిపోతున్నాయా? లేదే.. అవి అలాగే ఉంటాయ్..

ఇలా తాగడానికి మనం వెతుక్కునే సాకులు ఎన్నో.. నిజంగానే కష్టాలు వచ్చాయి అనుకోండి తాగుడు దానికి పరిష్కారం కానే కాదు
పిరికివాడు ఎంచుకునే మొదటి మార్గం తాగుడైతే, ధైర్యవంతుడు ఎంచుకునే మార్గం సమస్యని అర్ధం చేసుకోవడం..
ఏం చేస్తే దీని నుంచి బయట పడొచ్చు అనే దారులు వెతుకుంతుంటాడు అలా ప్రయత్నించే క్రమం లోనే అతను కష్టాల్ని దాటేస్తాడు..
కాబట్టి కష్టాల్ని మర్చిపోయి వాటికి దూరంగా పారిపోవడం కాదు వాటికి ఎదురు నిలబడి తాడో పేడో తేల్చుకోవడం చేయాలి..

మీకు తాగాలనిపిస్తే తాగండి అంతే కానీ కష్టాలు మర్చిపోవడానికి, బాధల్ని దిగమింగుకోవడానికి అని కాకమ్మ కబుర్లు మాత్రం చెప్పకండి.. ఎందుకంటే తాగుడుతో అవి జరగవు కాబట్టి!!

                                                                                                                               లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అబ్బాయికి 'అప్పగింతలు' !!

అమ్మ కొడుకు...

మన ఊరి 'సంక్రాంతి'!!